Telangana : పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్‌నగర్‌లో దారుణం జరిగింది. నీలందత్తు, లావణ్య దంపతుల ఐదు నెలల కొడుకు.. వాళ్లు పనిచేస్తున్న నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమ యజమానికి చెందిన కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. By B Aravind 15 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Dog Attack : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్‌నగర్‌లో దారుణం జరిగింది. ఐదు నెలల పసికందు(5 Months Old Baby) కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) చిన్నచింతకుంట మండలం దుప్పలికి చెందిన నీలందత్తు, లావణ్య దంపతులు బసవేశ్వర్‌నగర్‌లో నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం పనిలో చేరారు. ఆ పరిశ్రమ ప్రాంగణంలోనే వాళ్లకు కేటాయించిన గదిలో ఈ దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ఐదు నెలల కొడుకు సాయినాథ్ ఉన్నాడు. Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం! మంగళవారం ఉదయం నీలందత్తు నాపరాయి కోత పని చేస్తున్నాడు. భార్యను మంచినీళ్లు అడగ్గా ఆమె బిడ్డను పడుకోబెట్టి భర్త వద్దకు వెళ్లింది. కొద్దిసేపటికే బాలుడి ఏడుపు వినిపించింది. వెంటనే లావణ్య వెళ్లి చూడగా.. యజమాని పెంపుడు కుక్క బాలుడిని కరుస్తూ కనిపించింది. తరిమేందుకు ప్రయత్నించగా ఆమెపై కూడా దాడికి యత్నించింది. భార్య కేకలు విన్న నీలం దత్తు కుక్కను రాయితో కొట్టగా అది పారిపోయింది. తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దత్తు కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యజమాని కుటుంబ సభ్యులు వెంటనే ఆ కుక్కను కొట్టి చంపేశారు. దత్తు ఫిర్యాదు మేరకు నాగభూషణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: శుభవార్త చెప్పిన ఐఎండీ..జూన్ ఒకటినే కేరళకు వస్తున్న రుతుపవనాలు! #mahabubnagar-district #dog-attack #telanagna-news #5-month-old-baby-died మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి