Russia- Ukarian: విరాళంగా రూ. 4 వేలు..జైలు శిక్ష 12 ఏళ్లు! రష్యా-అమెరికాకు చెందిన ఖవానా అనే మహిళ ఉక్రెయిన్ కి విరాళాలు అందజేసిన నేపథ్యంలో...ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే ఆమె సేకరించిన విరాళాల మొత్తం కేవలం 4,200 రూపాయలు మాత్రమే. By Bhavana 16 Aug 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Russia- Ukrain: ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేస్తున్న నేపథ్యంలో శత్రుదేశానికి మద్దుతుగా నిలిచే వారి పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాశాలు సేకరించి ఇచ్చినందుకు ఓ అమెరికా-రష్యన్ మహిళను కఠినంగా శిక్షించింది. కేవలం 51 డాలర్లు అంటే సుమారు రూ. 4,200 లను ఆమె విరాళంగా అందజేసిన కేసులో ఆమెను రష్యా కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. వివరాల ప్రకారం...రష్యాకు చెందిన సేనియా ఖవానా (33) ఓ డ్యాన్సర్. అయితే ఈ మహిళ వివాహం అయిన తరువాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో స్థిరపడింది. అయితే కొద్ది రోజుల క్రితం ఆమె రష్యాకి వచ్చింది. ఉక్రెయిన్ సంస్థలకు ప్రయోజనం కలిగించేలా పని చేస్తున్న అమెరికాకకు చెందిన ఓ సంస్థ కోసం ఆమె విరాళాలు సేకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా సేకరించిన 51 డాలర్ల నగదును కూడా ఆ స్వచ్ఛంద సంస్థకు బదిలీ చేసినట్లు ఆమె అంగీకరించింది. అయితే వాటిని రష్యాకు వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలకు ఉపయోగిస్తారనే విషయం మాత్రం తనకు తెలియదని ఖవానా తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దేశ ద్రోహం కింద అభియోగాలు మోపగా..విచారణలో దోషిగా తేలింది. దీంతో రష్యా కోర్టు ఆమెకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. Also Read: సరికొత్తగా దులీప్ ట్రోఫీ..ఫార్మాట్‌ను మార్చిన బీసీసీఐ #women #russia #ukrain #donation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి