31 మంది స్మగ్లర్లు అరెస్టు: టాస్క్ ఫోర్సు ఎస్పీ కే. చక్రవర్తి By Jyoshna Sappogula 20 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Ap police: ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. ఆయన సోమవారం టాస్క్ ఫోర్సు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుల నుంచి 15 ఎర్రచందనం దుంగలు, 20 గొడ్డళ్లు, 20 సెల్ ఫోన్లు, టాటా కంపెనీ లారీ, బొలేరో వాహనంతో పాటు రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. Also Read: కానిస్టేబుల్ నిర్వాకం..పీఎస్ ఎదుటే నిప్పంటించుకున్న వ్యక్తి.! కర్నూలు రేంజి డీఐజీ ఎస్ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు రాబడిన సమాచారంతో ఆర్ఎస్ఐలు వినోద్ కుమార్, విశ్వనాథ్ టీమ్ ఆదివారం ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలు – చీమకుర్తి రోడ్డు వద్ద సంతనూతలపాడు పోలీసు స్టేషను సమీపంలో తనిఖీలు చేస్తుండగా వీరిని గుర్తించినట్లు తెలిపారు. వీరిని చట్టుముట్టే ప్రయత్నం చేయగా, కొందరు తప్పించుకున్నారని, 31 మందిని పట్టుకోగలిగామని చెప్పారు. పట్టుబడిన వారిలో ప్రధాన ముద్దాయి గుద్దేటి రామనాథ రెడ్డి (37) అని తెలిపారు. కాగా ఇతను నెల్లూరు జిల్లా వింజమూరుకు చెందిన వ్యక్తి అని.. అతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో 60కేసులు ఉన్నాయని, మోస్ట్ వాంటెడ్ ముద్దాయని పేర్కొన్నారు. Also read: కదిరిలో రెచ్చిపోయిన అధికార పార్టీ నాయకులు.! ఇతని తోపాటు తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన మేస్త్రి రాజికుప్పుస్వామి(46)లుగా గుర్తించారు. మిగిలిన వారు తమిళనాడు నుంచి రాజికుప్పుస్వామికి చెందిన కూలీలుగా గుర్తించినట్లు చెప్పారు. వీటిలో దుంగలు విలువ రూ.25 లక్షల వరకు ఉండగా, వాహనాలు రూ.20 లక్షలుగా అంచనా వేసినట్లు తెలిపారు. ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందికి రివార్డులను సిఫారసు చేసినట్లు చెప్పారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేయగా, సీఐ జీ. శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబు, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, సురేష్ కుమార్, ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ ఆర్ఐఎస్ లు, ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది పాల్గొన్నారు. #andhra-pradesh #ap-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి