ఆగని మణిపూర్‌ హింస..అర్థరాత్రి దాడి..ముగ్గురి మృతి!

మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. బిష్ణుపూర్ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన తాజా హింసాకాండలో తండ్రీకొడుకులు సహా ముగ్గురు చనిపోయారు.

New Update
ఆగని మణిపూర్‌ హింస..అర్థరాత్రి దాడి..ముగ్గురి మృతి!

Violence in Manipur: మణిపూర్‌లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు.

బిష్ణుపూర్ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన తాజా హింసాకాండలో తండ్రీకొడుకులు సహా ముగ్గురు చనిపోయారు. బిష్ణుపూర్ లోని క్వాక్తా సమీపంలోని ఉఖా తంపాక్ గ్రామంపై ఉగ్రవాదులు దాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనలో ఇద్దరు తండ్రీకొడుకులు, వారి పక్కింట్లో నివసించే మరో వ్యక్తిని దుండగులు హతమార్చారు. నిద్రిస్తున్న ముగ్గురిని కాల్చి చంపారని, అనంతరం కత్తులతో నరికారు.

మెయిటీ ప్రాంతాల నుంచి బఫర్ జోన్‌ను దాటుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతానికి రెండు కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న బఫర్‌జోన్‌ వద్ద పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

బిష్ణుపూర్ లోని తెరఖోంగ్ సంగ్బీ వద్ద గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని ముష్కరులు, ప్రభుత్వ బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 35 ఏళ్ల అరిబమ్ వహీదా బీబీ అనే మహిళ చేతికి బుల్లెట్ గాయమైంది. ఆమె ప్రస్తుతం ఇంఫాల్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

మూడు నెలల క్రితం మణిపుర్‌లో రెండు తెగల మధ్య హింస చెలరేగింది. అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్నది. ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో 160 మందికిపైగా మరణించారు. ఈ అల్లర్లలో వందలాది మంది గాయపడ్డారు.

Also Read: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు.. అతిథులు ఎవరంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు