ఆగని మణిపూర్ హింస..అర్థరాత్రి దాడి..ముగ్గురి మృతి!
మణిపూర్లో హింసకు తెరపడడం లేదు. బిష్ణుపూర్ జిల్లాలో గత రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. వీరు క్వాక్టా ప్రాంతానికి చెందిన మెయిటీ తెగకు చెందినవారు. ఈ ఘటన తర్వాత కుకీ తెగకు చెందిన వారి ఇళ్లకు దుండగులు నిప్పుపెట్టారు. బిష్ణుపూర్ జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన తాజా హింసాకాండలో తండ్రీకొడుకులు సహా ముగ్గురు చనిపోయారు.
/rtv/media/media_files/2026/05/14/manipur-2026-05-14-10-35-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/manipur-1-jpg.webp)