TS News : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరిన 17 మంది కౌన్సిలర్లు..!! సూర్యపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17మంది కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Bhoomi 14 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS News : సూర్యపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 17మంది కౌన్సిలర్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి ఉత్తమ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతా అనుకున్నట్టే జరిగింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కౌన్సిలర్లు బుధవారం హైదరాబాదులో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలో సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి నాయకత్వంలో వారు కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో అవినీతి రాజ్యమేలుందని దానికి సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి పేరిట భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. నూతనంగా పార్టీలోకి చేరిన కౌన్సిలర్లు ఇదివరకే పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యల పై పోరాడి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. రాబోయే లోకసభ ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కౌన్సిలర్లు కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి, మామిడి గౌరయ్య, ధరావత్ రవి ,జాటోత్ మకట్లాల్ లక్ష్మి, ధారావత్ నీలాబాయి, కుంభం రేణుక, బచ్చల కూరి శ్రీను ,ఎలిమినేటి అభినయ్, మాలోత్ కమల అనేపర్తి, రాజేష్ ,చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ, రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ,అనంతుల యాదగిరి గౌడ్ ,ఎస్కే జహీర్ జ్యోతి శ్రీవిద్య ,గండూరి రాధిక, రమేష్ నామ అరుణ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజాద్ అలీ జిల్లా నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, గండూరి రమేష్ కుంభం రాజేందర్, రుద్రంగి రవి రాపర్తి, సైదులు రాపర్తి లచ్చయ్య, అనంతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: ఇండియన్ నేవీలో కొత్త డ్రెస్ కోడ్…కుర్తా-పైజామా…పూర్తి వివరాలివే..!! #brs #congress #suryapet #brs-councillors మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి