భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు హరికృష్ణ మృతి చెందాడు. పాఠశాలలోనే ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
Khammam : గుండెపోటు (Heart Attack).. ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియడం లేదు. ఒకప్పుడు కేవలం పెద్దవారికి మాత్రమే వస్తుండేది. కానీ ఈ కాలంలో చిన్న, పెద్ద ఏమీ తేడా లేకుండా అందరికీ వస్తోంది. తాజాగా, గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. ఈ విషాదకరమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Kothagudem District) చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో చోటుచేసుకుంది.
ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న 13 ఏళ్ల హరికృష్ణకు పాఠశాలలోనే ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, బాలుడికి గుండె సంబంధిత సమస్యలు (Heart Problems) ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
AP Crime: రైస్ మిల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి!
ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
AP Crime: ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.
ట్రాలీలో రైస్ తీసుకొస్తుండగా..
ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలిపారు.
బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం పైన, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని, విద్యుత్ అధికారులు వైర్లు కిందకు ఉన్నా పట్టించుకోకపోవడం తో ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు తమముందు కన్నీటి పర్యాంతమయ్యారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫునుంచి ఆదుకోవాలని, వైసీపీ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఇలాంటి ఘటన మళ్లీ పునరవృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.