TS News: తెలంగాణలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు!

క్రిస్మస్‌ సెలవుల కోసం హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని గుండెపోటు చంపేసింది. రాజన్న సిరిసిల్ల గ్రామానికి చెందిన సుశాంత్‌ (13) సోమవారం ఉదయం ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

New Update
TS News: తెలంగాణలో పెను విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన 13 ఏళ్ల బాలుడు!

క్రిస్మస్‌ సెలవుల కోసం ఇంటికి వచ్చిన 13 ఏళ్ల బాలుడ్ని గుండెపోటు బలి తీసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం నిజామాబాద్‌ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన తాళ్లపల్లి శంకర్‌, సరిత దంపతులకు ఇద్దరు కొడుకులు యశ్వంత్‌, సుశాంత్‌ (13) . సుశాంత్‌ ముస్తాబాద్‌ గురుకుల స్కూల్‌ లో 9 వ తరగతి చదువుతున్నాడు.

క్రిస్మస్‌ సెలవులు రావడంతో రెండు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం ఒక్కసారిగా సుశాంత్‌ ఛాతీలో నొప్పిగా ఉందంటూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడ్ని వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే చనిపోయినట్లు నిర్థారించారు.

గుండెపోటు రావడంతోనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో.. తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నిన్నమొన్నటి వరకు ఇంట్లో అల్లారుముద్దగా తిరిగిన కొడుకు..అనంతలోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోధనలు స్థానికుల కంటతడిపెట్టిస్తుంది. బాలుడు సుశాంత్‌ మృతి.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Also read: పవన్ సీటు మార్చుకుంటే తప్పు లేదు కానీ.. మేము కో ఆర్డినేటర్‌లను మార్చితే తప్పా: మంత్రి సిదిరి ఫైర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment