12th Fail Movie: ఓటీటీలో ‘12th ఫెయిల్’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..? విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. ఇప్పటికే ఓటీటీలో రిలీజైన ఈ సినిమా హిందీ వెర్షన్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమవుతోంది. By Archana 05 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి 12th Fail Movie Telugu OTT: విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ (Manoj Kumar Sharma), ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘12th ఫెయిల్’. బయోగ్రాఫికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించారు. గతేడాది అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినీ ప్రముఖులు, విమర్శకుల చేత ప్రశంశలు అందుకుంది. ఇటీవలే జరిగిన 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో (FilM Fare Award) ఉత్తమ చిత్రంతో సహా ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 స్థానంలో నిలిచిన ఏకైక చిత్రంగా రికార్డు సృష్టించింది. Also Read: This Week OTT Release: ఈ వారం ఓటీటీలో సూపర్ హిట్ చిత్రాలు.. అందరూ వెయిట్ చేస్తున్న ఆ సినిమా కూడా ఓటీటీలో ‘12th Fail’ తెలుగు వెర్షన్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ‘12th ఫెయిల్’ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. కానీ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండడంతో.. తెలుగులో చూడాలనుకునే వారికి నిరాశే మిగిలింది. ఇక నేటితో తెలుగు వెర్షన్ లో చూడాలనుకున్న వారి ఎదురుచూపులకు తెరపడింది. తాజాగా ‘12th ఫెయిల్’ మూవీ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో (Disney Plus Hotstar) స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తెలుగు మాత్రమే కాదు తమిళ్ వెర్షన్ లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. Also Read: Ambani Wedding: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు! #12th-fail-telugu-ott #12th-fail-telugu-version #12th-fail-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి