Minor Girl Rape:బాలిక పై అత్యాచారం..నడి రోడ్డు పై సాయం కోసం వేడుకున్న ముందుకు రాని జనం!

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 12 ఏళ్ల బాలిక పై ఆమె ఇంట్లోనే అత్యాచారం (Rape)చేసి, బాలికను తీవ్రంగా వేధించారు. బాలిక ఒంటి పై దుస్తులన్ని చించివేశారు. దుండగులు నుంచి తప్పించుకున్న బాలిక..అలాగే సాయం కోసం రోడ్ల వెంట పరుగులు పెట్టింది. కానీ ఎవరూ ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.

New Update
Minor Girl Rape:బాలిక పై అత్యాచారం..నడి రోడ్డు పై సాయం కోసం వేడుకున్న ముందుకు రాని జనం!

రోజురోజుకి మనుషుల్లో మానవత్వం కనుమరుగవుతుంది. సాయం చేయమని వేడుకున్న చోద్యం చూస్తు నిల్చున్నారే తప్ప ఒక్కరు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. 12 ఏళ్ల బాలిక (Minor Girl) పై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆ రాక్షస హస్తాల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి తల్లి రోడ్డు మీదకు పరిగెత్తుకు వచ్చింది.

ఎవరైనా సాయం చేయకపోతారా అని నెత్తురోడుతున్న శరీరంతో నడి వీధుల్లో పరుగులు పెట్టినప్పటికీ..సాయం చేయడానికి మాత్రం ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇలా ఆ చిన్నారి 2 గంటలు పాటు నరకయాతన అనుభవించింది.ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ (Madhyapradesh) ఉజ్జయిని(Ujjayini) జిల్లా లో చోటు చేసుకుంది.

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 12 ఏళ్ల బాలిక పై ఆమె ఇంట్లోనే అత్యాచారం (Rape)చేసి, బాలికను తీవ్రంగా వేధించారు. బాలిక ఒంటి పై దుస్తులన్ని చించివేశారు. దుండగులు నుంచి తప్పించుకున్న బాలిక..అలాగే సాయం కోసం రోడ్ల వెంట పరుగులు పెట్టింది. కానీ ఎవరూ ఆమెకు సాయం అందించడానికి ముందుకు రాలేదు.

చిరిగిన దుస్తులతో..ఒంటి పై గాయాలతో బాలిక అలా వెళ్తున్న కానీ అందరూ కళ్లు అప్పగించి చూశారే కానీ ఒక్కరు కూడా చేయి ఇవ్వడానికి ముందుకు రాలేదు. బాలిక సుమారు 2 గంటల పాటు 8 కిలోమీటర్లు నడిచిన తరువాత ఓ ఆశ్రమం వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న పూజారి..చిన్నారిని చూసి జాలిపడిన ఆయన ముందుగా ఆమెకు దుస్తులు అందించారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. పాపను ఇండోర్‌ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీని గురించి ఉజ్జయిని ఎస్పీ స్పందించారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. బాలిక నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాలిక తన తల్లితో కలిసి ఉత్తర ప్రదేశ్‌ నుంచి వచ్చినట్లు సమాచారం. బాలిక నడి రోడ్డు మీద అలా సాయం కోసం పరుగులు పెడుతుంటే కనీసం ఒక్కరు కూడా స్పందించకపోవడంతో ఎస్పీ విచారం వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు