తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం

తాంత్రిక పూజలతో గుప్తనిధులు చూపించి ధనవంతులను చేస్తానని 11 మందిని హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. ప్రశ్నించిన బాధితులకు జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తీర్థం పేరిట తాగించి అపస్మారకస్థితికి చేరుకోగానే బండరాయితో కొట్టి చంపిన సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం

Nagarkurnool : గుప్తనిధుల ఆశ చూపించి ఓ వ్యక్తి అమాయక ప్రజల ప్రాణాలు తీసిన దారుణమైన సంఘటన నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు తాంత్రిక పూజలతో తమను ధనవంతులను చేస్తానని చెప్పి ఉన్న ఆస్తి మొత్తం కాజేసిన నిందుతుడు ప్రశ్నించిన వారందరినీ ఒక్కొక్కరిగా పతకం ప్రకారం హతమార్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది.

ఈ మేరకు మంగళవారం నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జోగులాంబ గద్వాల జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి హత్యలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని ఇంద్రానగర్‌కాలనీలో నివసిస్తున్న రామటి సత్యనారాయణ అలియాస్‌ సత్యంయాదవ్‌(47) కుటుంబ వారసత్వంగా వచ్చిన పాము, తేలు మంత్రాలు వేసే వృత్తిలో ఉండేవారు. తర్వాత తాంత్రిక పూజలతో గుప్త నిధులు వెలికితీస్తానంటూ అమాయక ప్రజలను నమ్మించి వారి నుంచి డబ్బులు తీసుకోవడం, వారి ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం చేసేవాడు. తాంత్రిక పూజలతో గుప్తనిధుల జాడ చూపిస్తానని నమ్మించి ఏకంగా 11 మంది అమాయక ప్రజలను దారుణంగా హతమార్చాడు. బాధితులు తమ సొమ్ము తిరిగివ్వాలని ఒత్తిడి చేస్తే క్షుద్రపూజలు చేస్తానని పథకం ప్రకారం దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విష రసాయనాలు, జిల్లేడు పాలు కలిపిన గేదె పాలను తీర్థం పేరిట ఇచ్చేవాడు. వారు అపస్మారకస్థితికి చేరుకోగానే బండరాయితో తలపై కొట్టి హత్య చేసేవాడు.

ఇది కూడా చదవండి : Telangana: టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్‌ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్..

ఈ క్రమంలోనే 2020 నుంచి 8 కేసుల్లో 11 మందిని హత్య చేశాడు. 2020లో వనపర్తి జిల్లా రేవల్లి ఠాణా పరిధిలో నలుగురు, 2021లో నాగర్‌కర్నూల్‌ ఠాణా పరిధిలో, కొల్లాపూర్‌, 2022లో నాగర్‌కర్నూల్‌, 2023లో కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కర్ణాటక రాష్ట్రంలోని బలగనూర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపురం జిల్లా పెద్దవడుగూర్‌ ఠాణా పరిధుల్లో ఒకర్ని చొప్పున హత్య చేశాడు. హతులంతా నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. నిందితుడి నుంచి 8 చరవాణులు, 10 సిమ్‌కార్డులు, 5 విషపూరిత రసాయనాలు కలిగిన సీసాలు, 5 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, ఒక కారు, మృతులకు చెందిన 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ‘ఇప్పటికే నిందితుడిపై ఒకే ప్లాటును ఇద్దరికి విక్రయించిన కేసు కోర్టులో పెండింగ్‌ ఉంది. సత్యంయాదవ్‌ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో మళ్లీ విచారణ చేపడతాం’ అని డీఐజీ తెలిపారు.

ఇలా బయటపడింది:
హైదరాబాద్‌లోని బొల్లారంలో నివసం ఉంటున్న వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేశ్‌.. నాగర్‌కర్నూల్‌లోని సత్యంను కలిసేందుకు వెళ్లి 5 రోజులైనా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన ఆయన భార్య లక్ష్మి నవంబరు 26న నాగర్‌కర్నూల్‌ పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యంయాదవ్‌ ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. ‘రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే సత్యంయాదవ్‌ తాను గుప్తనిధులు వెలికితీస్తానంటూ సహచర వ్యాపారులకు చెప్పేవాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్‌ స్నేహితులతో కలిసి గుప్తనిధి కోసం ఆయనను అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన నిందితుడు ఈ ప్రక్రియలో వెంకటేశ్‌ మాత్రమే తనను సంప్రదించాలని షరతు పెడుతూ డబ్బులు తీసుకున్నాడు. అనంతరం నిధి దొరకాలంటే ముగ్గురు గర్భిణులను బలి ఇవ్వాలని చెప్పడంతో వెంకటేశ్‌ భయపడ్డాడు. అలాంటివి ఏమీ వద్దని.. డబ్బు తిరిగిచ్చేయమన్నాడు. దీంతో సత్యంయాదవ్‌ డిసెంబరు 4న పూజ చేస్తానంటూ నమ్మించి నగర శివారులోని ఓ కొండపైకి వెంకటేశ్‌ను తీసుకెళ్లాడు. పూజ పేరిట రసాయనం కలిపిన పాలు తాగించాడు. అతను స్పృహ కోల్పోగానే ముఖంపై యాసిడ్‌ పోసి హత్య చేశాడు. దీనితోపాటు మూడు రాష్ట్రాల్లో మరో 10 మందిని ఇదేవిధంగా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు