ఐదేళ్ళల్లో విదేశాల్లో 403 మంది విద్యార్ధులు మృతి..ఆ దేశంలోనే ఎక్కువ

విదేశాలకు ఎన్నో ఆశలతో చదువుకోవడానికి వెళుతున్న విద్యార్ధుల మృత్యువాత పడుతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ 2018 నుంచి ఇప్పటి వరకూ 403 మంది విద్యార్ధులు మరణించారు.

New Update
AP: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి.!

విదేశాలకు వెళ్ళి చదువుకోవడం ఓ పెద్ద కల. ఇది అందరికీ సాకారం కాదు. కష్టపడి చదివి...డబ్బులు కూడగట్టుకుని విదేశాలకు వెళుతున్నారు విద్యార్ధులు. కానీ వాళ్ళల్లో కొంతమంది అకాల మరణం చెందుతున్నారు. వారి తల్లిదండ్రులను కన్నీరును మిగులుస్తున్నారు. ఇలా గత ఐదేళ్ళల్లో మొత్తం 403 మంది విద్యార్ధులు మృత్యువాతన పడ్డారని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

Also raed:కేసీఆర్ కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ..పర్యవేక్షిస్తున్న కొత్త సీఎం రేవంత్ టీమ్.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. గత ఐదేళ్ళలో మొత్తంగా 34 దేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మరణించారు. అన్నిటికంటే అత్యధికంగా కెనడాలో 91 మంది మృతిచెందారు. ఆ తర్వాత యూకేలో 48, రష్యాలో 40, అమెరికాలో 36, ఆస్ట్రేలియాలో 35, ఉక్రెయిన్‌లో 21, జర్మనీలో 20, సైప్రస్‌లో 14, ఇటలీ, ఫిలిప్పీన్స్‌లో 10 మంది చొప్పున విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

కెనడాకు విద్యార్ధులు ఎక్కువగా వెళుతున్నారని అందుకనే అక్కడ మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెబుతున్నారు.అయితే దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలో లేదో ఇంకా తేల్చుకోలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ చెప్పారు. మరణించిన వారి వెనుక అనేక కారణాలున్నాయి. కొంతమందివి వ్యక్తిగత కారనాలు అయితే మరికొన్ని యాక్సిడెంట్లు, కాల్పులు, కుట్రలు తదితరాలున్నాయని చెప్పాయి. కుట్రలు ఇతర కారణాల వల్ల చోటు చేసుకున్న మరణాల గురించి మాత్రం ఎంక్వయిరీ చేస్తున్నామని తెలిపారు.

విదేశాల్లో భారతీయుల పట్ల దాడులు జరుగుతూనే ఉంటాయి. యూఎస్, కెనడాల్లో రేసిజం సమస్య కూడా ఉంది. రీసెంట్ గా కెనడాలో కొందరు భారతీయ విద్యార్ధులపై దాడులు జరిగాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు