యుద్ధం ఆగడం కష్టమే.. పశ్చిమాసియాకు వెళ్తున్న వేలాది యూఎస్ బలగాలు
ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చివరి దశకు తీసుకెళ్లేందుకు ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపునకు వేలాదిగా యూఎస్ బలగాలు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధాన్ని చివరి దశకు తీసుకెళ్లేందుకు ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమాసియా వైపునకు వేలాదిగా యూఎస్ బలగాలు తరలించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం టెహ్రాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండగా దుబాయ్‌లో 35 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో 19 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా తప్పుదారి పట్టించే సమాచారాన్ని, నకిలీ కంటెంట్‌ను వైరల్ చేస్తున్నారని UAE కఠిన చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలసిందే. ఆ రూట్లో ఇంధన సరఫరా ఆగిపోవడంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. తాజాగా మరో ముప్పు పొంచి ఉంది. బాబ్ ఎల్‌మండేబ్ అనే జలసంధి కూడా మూతపడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, UAE, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లో జరగనున్న సీబీఎస్సీ పరీక్షలు రద్దు చేసింది.
బెంజమిన్ నెతన్యాహూ మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఒకవేళ ఆయన ప్రాణాలతో ఉంటే.. వేటాడి మరీ చంపుతాం" అంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం యుద్ధంలో ఈ హెచ్చరికలు హాట్ టాపిక్‌గా మారాయి.
మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో మొజ్తబా మరణించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు నెతన్యాహు కూడా మరణించినట్లు ఇరాన్ వార్త సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.