/rtv/media/media_files/2026/03/14/netanyahu-and-khamenei-2026-03-14-09-49-25.jpg)
Netanyahu and Khamenei
బెంజమిన్ నెతన్యాహూ మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఒకవేళ ఆయన ప్రాణాలతో ఉంటే.. వేటాడి మరీ చంపుతాం" అంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఈ హెచ్చరికలు హాట్ టాపిక్గా మారాయి.
Also Read : సంచలన నిర్ణయం.. CBSC పరీక్షలు రద్దు
నెతన్యాహూ మరణంపై పుకార్లు
గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ(benjamin-netanyahu) బయట కనిపించకపోవడంతో ఆయన మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వ్యాపించాయి. ముఖ్యంగా ఇరాన్(iran-isreal-war) ప్రయోగించిన క్షిపణి దాడుల్లో నెతన్యాహూ కార్యాలయం లేదా ఆయన నివాసం దెబ్బతిన్నదని, ఆ దాడిలోనే ఆయన మరణించారని కొన్ని ఇరానియన్ మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి. దీనికి తోడు, నెతన్యాహూ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆయన వేళ్లు వింతగా ఉన్నాయని, అది ఏఐ (AI) సృష్టించిన నకిలీ వీడియో అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు.
ఇరాన్ తీవ్ర హెచ్చరికలు
ఈ పుకార్ల మధ్యే ఇరాన్ సైనిక విభాగం అయిన రివల్యూషనరీ గార్డ్స్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. చిన్న పిల్లల్ని చంపిన ఆ హంతకుడు (నెతన్యాహూ(Israeli PM Netanyahu)) ఒకవేళ ఇంకా బతికే ఉంటే, మేము అతడిని వదిలిపెట్టం. పూర్తి బలంతో అతడిని వెంబడించి మరీ అంతం చేస్తాం" అని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఇజ్రాయెల్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఆ దేశ నాయకత్వం ప్రాణభయంతో తలదాచుకుంటోందని ఇరాన్ ఎద్దేవా చేసింది.
క్లారిటీ ఇచ్చిన ఇజ్రాయెల్
అయితే, ఈ వార్తలన్నీ అవాస్తవమని నెతన్యాహూ కార్యాలయం స్పష్టం చేసింది. "ప్రధాని క్షేమంగా ఉన్నారు, ఆయన తన విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇవన్నీ శత్రు దేశాలు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారాలు" అని కొట్టిపారేసింది. నెతన్యాహూ తాజాగా ఒక భద్రతా సమావేశంలో పాల్గొన్న ఫోటోలను కూడా విడుదల చేసే ప్రయత్నం చేసింది.
Also Read : వీసా కోసం వింత డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్!
Follow Us