Breaking News : షాద్ నగర్ లో కాంగ్రెస్ నేత పై హత్యా యత్నం..! బ్లేడుతో గొంతు కోసి....
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం చిలకమర్రి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆషాడ బోనాల సందర్భంగా చిలకమర్రి గ్రామంలో జరిగిన ఘర్షణలో ఆయనపై బ్లేడుతో దాడి చేశారు.