Eatela: నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేను. కానీ అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి అని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు ఆ పోస్టుల గురించి సమయం వచ్చినప్పుడు పార్టీనే తేలుస్తుందన్నారు. ఈ మేరకు కమలాపూర్ లో తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్ పలు విషయాలపై మాట్లాడారు. కాగా మొన్న ఈటెల రాజేందర్ బలపర్చిన అభ్యర్థిపై బండి సంజయ్ బలపర్చిన అభ్యర్తి గెలిచారని మీడియా ప్రకటన విడుదల చేసిన బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది సొంత పార్టీ ఎంపీ పై బండి చేసిన మెసేజ్ కు కౌంటర్ గానే ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారనే చర్చ కమలం పార్టీలో జోరందుకుంది.ఈ విషయంలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఏం చేస్తున్నారు ప్రజలకు అర్థమవుతుంది వారే తేలుస్తారన్నారు.
ఇక ప్రభుత్వంపై మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్ లా వ్యవహరిస్తున్నాడన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి మెస్సితో ఫుట్బాల్ ఆడుతున్నాడు. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ సింగరేణి డబ్బులు 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారు. పేదల ఇళ్లను కూలుస్తున్న హైడ్రా పెద్దల కబ్జాను పట్టించుకోవడం లేదు. కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి.
హుజురాబాద్ లో సోషల్ మీడియా పోస్టులు అవగాహన లేని వారు చేస్తున్న పని. వాటిమీద పార్టీ చర్యలు తీసుకుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వారందరినీ తమ ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. కమలాపూర్ లో కుట్రలను ఛేదించి సతీష్ ని గెలిపించినందుకు ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అని రాజేందర్ అన్నారు.
11వ తేదీ జరిగిన ఎన్నికల్లో BRS పలికిన ప్రగల్భాలు, అబద్ధపు ప్రచారాలు, ప్రలోభాలు కాదని బిజెపి బలపరిచిన అభ్యర్థులు కమలాపూర్ లో శనిగరం గుండేడు గూడూరు గెలిపించడమే కాకుండా మేము మద్దతు ఇచ్చిన ఐదు గ్రామాలు దేశరాజు పల్లి కానిపర్తి గోపాలపురం మాదన్నపేట నేరెళ్లలో కూడా విజయం సాధించామన్నారు.ఈ ఎన్నికలు ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న నాయకుడు, ఆ తదుపరే వారి వెనుకున్న నాయకుడు పార్టీ ను చూసి ఫలితాలు వస్తాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఈ దఫా చాలా గ్రామాలలో మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము మాకు ఎవరితో అక్కరలేదని పార్టీలు ఉన్నప్పటికీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారికి విశ్వాసమున్న నాయకులతో ఒకటి రెండు నిమిషాల వీడియో సపోర్ట్ అడిగారు తప్ప ఏ మద్దతు కోరలేదు. మేము వీడియోలో సపోర్ట్ చేసిన వారు కూడా గెలిచారు. గెలిచిన తర్వాత ఐదు లక్షలు 10 లక్షలు ఇస్తాం మా పార్టీకి రండి మా పార్టీలో గెలిచినట్టు చెప్పుకోండి అని చిల్లర ప్రయత్నం కొనసాగుతుంది. ఎన్నికలముందే మాకు ఫలానా నాయకుడి ఆశీర్వాదం ఉంది అని చెప్తే మంచిది కానీ.. ఒకసారి ప్రజలు గెలిపించిన తర్వాత మళ్ళీ ఆయన వెనుక ఈయన వెనక పోతాము అంటే.. గెలిచిన తర్వాత అటు ఇటు పోతే ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదని రాజేందర్ స్పష్టం చేశారు.
గెలిచినవారు ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నాను. స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తులు ఉండవు. స్థానిక సంస్థల ఎన్నికలంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. నిధులు వస్తాయని అభిప్రాయం ఉంటుంది. ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ 50% సీట్లు కూడా గెలవలేదు. గెలిచిన వారిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం మాటల గారడితో మీడియాను మేనేజ్ చేసి ప్రజలను అదరగొట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నడిపిస్తుంది. కానీ ప్రజా ప్రభుత్వంలాగా కొనసాగడం లేదని గుర్తు చేస్తున్నాను. సర్పంచ్లకు వార్డు మెంబర్లకు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి వారి ఖాతాలో వేసుకోవడం కాదు ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి అని రాజేందర్ సూచించారు.
Eatela: వాడో పిచ్చోడు.. బండి టార్గెట్ గా ఈటల సంచలన వ్యాఖ్యలు!
నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొంతమంది సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల గురించి స్పందించలేను. కానీ అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. రాజేందర్ ఏ పార్టీలో ఉన్నారో వారే చెప్పాలి అని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Eatela's sensational comments target Bandi!