Allu Aravind: టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అందుకే అడగలేదు: అల్లు అరవింద్
‘తండేల్’ మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వానికి అడగకపోవడానికి గల కారణాన్ని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. తెలంగాణలో మూవీ టికెట్ ధరలు రూ.295, రూ. 395 పెరిగి ఉన్నాయని అన్నారు. అందుకే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదని తెలిపారు.