Ustad Bhagat Singh: పవన్ డ్యాన్ అదిరిపోయింది..ఉస్తాద్ కొత్త పాట రిలీజ్

హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీలో కొత్త పాటను రిలీజ్ చేశారు. దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా అనే పాటలో పవన్ డాన్స్ ఇరగదీశారు. 

New Update
pawan song

OG' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan), ఇప్పుడు తన తదుపరి యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'తో మరోసారి అభిమానుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది. హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ హిట్ కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం వల్ల అభిమానుల్లో ఈ సినిమాపై మంచి హైప్ ఉంది. ఉస్తాద్ లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా..

తాజాగా ఈ సినిమాలో పాటను రిలీజ్ చేసింది. మూవీ టీమ్. వచ్చే ఏడాది మొదట్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. దానికి ముందు టజర్, సాంగ్ అంటూ ఒక్కొక్కటే వదులుతున్నారు. ప్రస్తుతం  దేఖ్‌లేంగే సాలా.. చూసినాము చాలా అనే పాట లిరికల్‌ వీడియోను  విడుదల చేశారు. ఇందులో పవన్ కల్యాణ్, శ్రీలీల మీద చిత్రీకరించారు. ఈ పాటో పవన్ కల్యాణ డాన్స్ తో ఇరగదీశారు. డిప్యూటీ సీఎం మంచి స్టైలిష్ గా కనిపించడమే కాక..తన సిగ్నేచర్ డాన్స్ తో అదరగొట్టారు కూడా. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు భాస్కర్‌ భట్ల సాహిత్యం అందించారు. విశాల్‌ ధడ్లానీ ఆలపించారు.

Advertisment
తాజా కథనాలు