/rtv/media/media_files/2026/03/16/indians-2026-03-16-20-11-40.jpg)
India asks its citizens not to cross Iran's border without coordination with embassy
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో అక్కడి భారతీయ రాయబార కార్యాలయం టెహ్రాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇరాన్ సరిహద్దు దాటి.. వేరే దేశాల నుంచి స్వదేశానికి వెళ్లాలని సూచనలు చేసింది. అయితే తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా తమతో సమన్వయం చేసుకోకుండా ఎవరూ కూడా సరిహద్దు దాటకూడదని హెచ్చరించింది.
Also Read: రష్యాలో మొజ్తబా ఖమేనీ.. వెలుగులోకి సంచలన నిజాలు
రాయబార కార్యాలయం సహకారం లేకుండా సరిహద్దుల నుంచి ఇరాన్‌ను విడిచి వెళ్లేందుకు యత్నిస్తే ఇమిగ్రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ఒక్కోసారి దేశం దాటాక కూడా తాము సాయం చేయలేని పరిస్థితులు వస్తాయని తెలిపింది. అందుకే ఇరాన్‌లో ఉన్న భారతీయులు తప్పకుండా తమకు సమాచారం ఇవ్వాలని.. మా సలహాలను తీసుకోవాలని ఆదేశించింది.
Also Read: ట్రంప్ సంచలన నిర్ణయం.. ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్..
ఇదిలాఉండగా ఇరాన్ నుంచి 550 మంది భారతీయులు అర్మేనియాకు వెళ్లినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వల్ తెలిపారు. వీళ్లలో 284 మంది టూరిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 90 మంది భారతీయులు అజర్‌బైజాన్‌కు వెళ్లారన్నారు. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్.. హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మార్గంలో నౌకల రాకపోకలు సురక్షితంగా సాగించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని ఇటీవల ట్రంప్ కోరారు. కానీ ఈ విషయంపై అమెరికా భారత్ మధ్య ఇప్పటిదాకా ఇంకా ఎలాంటి చర్చ జరగలేదని జైశ్వల్ స్పష్టం చేశారు.
Follow Us