Iran War: మొజ్తాబా ఖమేనీ, నెతన్యాహు మరణించారా?..వెలుగులోకి సంచన నిజాలు

మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో మొజ్తబా మరణించినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు నెతన్యాహు కూడా మరణించినట్లు ఇరాన్ వార్త సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

New Update
Netanyahu and Khamenei

Netanyahu and Khamenei

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి భీకర దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో  మొజ్తబా కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన కోమాలో ఉన్నట్లు బ్రిటన్‌కు చెందిన 'ది సన్' పత్రిక ఓ కథనాన్ని ప్రచూరించింది. ఆయన ఒకటి లేదా రెండు కాళ్లు కోల్పోయారని.. వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. మొజ్తబా ఉన్నటువంటి ఆస్పత్రి విభాగాన్ని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని.. ఆయన ఆదేశాలు లేనప్పటికీ ఇరాన్ నేతలు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చని తెలిపింది. 

Also Read: భారత చమురు కంపెనీలకి రోజుకు 2 వేల కోట్ల నష్టం

ఇజ్రాయెల్ మాత్రం మొజ్తాబా ఎప్పుడో చనిపోయినట్లు తెలిపింది. కానీ ఇరాన్ ఈ విషయాన్ని దాచిపెడుతోందని పేర్కొంది. ముందు ఆయన కోమాలో ఉన్నట్లు చెప్పి కొన్నేళ్ల తర్వాత ఆయన చనిపోయినట్లు ప్రకటిస్తుందని చెబుతోంది. కానీ ఇరాన్ ప్రభుత్వ వర్గాలు మాత్రం మొజ్తబా ఖమోనీ మరణించినట్లు ధ-ృవీకరించడం లేదు. దీంతో ఖమేనీ బతికి ఉన్నట్లు చెప్పేందుకు ఆయన ప్రకటనను విడుదల చేసింది. 

ఒకవేళ ఖమేనీ బతికి ఉంటే లైవ్‌ వీడియోలో కనిపించి ప్రజలు ధైర్యం చెప్పి ఉండేవారు కదా ? అని ఇజ్రాయెల్ ప్రశ్నిస్తోంది. మరోవైపు ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. మొజ్తబా ఖమేనీ ఏదో ఒక రూపంలో బతికే ఉండి ఉంటారని ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌ మాట్లాడుతూ ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఆయన గుర్తుపట్టలేని విధంగా మారారని చెప్పారు. 

నెతన్యాహు చనిపోయారా ?

ఇరాన్ చేసిన దాడుల్లో ఇజ్రాయెల్(iran-israel) ప్రధానమంత్రి నెతన్యాహు(netanyahu) ఉన్న రక్షణ కేంద్రం దెబ్బతిని ఆయన మృతి చెందినట్లు ఇరాన్‌కు చెందిన పలు వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి నెతన్యాహు కూడా భౌతికంగా కనిపించలేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు చేసిన రోజు నెతన్యాహు మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు. మార్చి 7న ఇజ్రాయెల్ సైన్యాన్ని అభినందిస్తూ ఆయనకు సంబంధించి ఇంకో వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియో ముందే రికార్డు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

Also Read: ఓమన్‌లో డ్రోన్ దాడి: ఇద్దరు భారతీయుల మృతి.. గల్ఫ్ దేశాల్లో హై అలర్ట్!

మార్చి 12న నెతన్యాహు వీడియో లింక్ ద్వారా మీడియాతో మాట్లాడారు. అది కూడా ఏఐతో ఎడిట్ చేసిన వీడియో అని అందులో ఉంది నెతన్యాహు కాదనే అనుమానాలు వస్తున్నాయి. ఆ వీడియోలో రిపోర్టర్లు కూడా కనపించలేదు. కేవలం వాళ్ల గొంతులు మాత్రమే వచ్చాయి. నెతన్యాహు ఒక్కే ఆ వీడియోలో కనిపించారు. ఆయన కుడిచేతికి 6 వేళ్లు కనిపించాయని.. ఎడమ చేతికి వేళ్లని ఒకే సైజులో ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏఐ వీడియో కావడం వల్లే నెతన్యాహు అలా కనిపించారని వాదిస్తోంది. అంతేకాదు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన యాంత్రికంగా సమాధానాలు చెప్పినట్లు ఆరోపిస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్ ఖమెనీ చనిపోయినట్లు చెప్పడం.. మరోవైపు నెతన్యాహు మరణించారని ఇరాన్ వాదిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Advertisment
తాజా కథనాలు