/rtv/media/media_files/2026/03/15/houthis-ready-to-pull-trigger-in-iran-war-2026-03-15-20-51-18.jpg)
Another strait to get shut after Hormuz, Houthis ready to pull trigger in Iran war
ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలసిందే. ఆ రూట్‌లో ఇంధన సరఫరా ఆగిపోవడంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. తాజాగా మరో ముప్పు పొంచి ఉంది. బాబ్ ఎల్‌మండేబ్ అనే జలసంధి కూడా మూతపడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. మమతా బెనర్జీకి షాక్ తప్పదా ?
యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ గ్రూప్ బాబ్ ఎల్‌మండేబ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని భావిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్‌ను దెబ్బతీసేందుకు ఈ మిలిటెంట్లు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ట్రిగ్గర్‌పై మా వేళ్లు రెడీగా ఉన్నాయని వాళ్లు హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఇది ఇరాన్ వ్యాహంలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ హౌతీలు ఈ రూట్‌ను అడ్డుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలున్నాయని అంటున్నారు.
బాబ్ ఎల్-మండేబ్ ఎక్కడుంది
ఈ జలసంధి ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ అలాగే హిందూ మహాసముద్రంతో కలుపుతోంది. ఈ మార్గం ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక లాంటింది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 18 శాతం ఈ రూట్ నుంచే వెళ్తుంది. రోజుకు సుమారు 8.8 మిలియన్ బ్యారెళ్ల చమురు, సహజ వాయువు (LNG) ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. యూరప్, ఆసియా ఖండాల మధ్య వెళ్లే నౌకలు సూయెజ్ కెనల్‌ను చేరుకోవాలంటే బాబ్ ఎల్-మండేబ్ జలసంధి మార్గం గుండానే వెళ్లాలి.
Also Read: నెతన్యాహూ బతికున్నా.. వెంటాడి చ*పేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని మరణంపై ఉత్కంఠ
ఒకవేళ ఈ జలసంధిని మూసివేస్తే నౌకలు ఆఫ్రికా చుట్టూ ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ మీదుగా వెళ్లాలి. దీంతో రవాణా సమయం అదనంగా 15 నుంచి 20 రోజులు పెరుగుతుంది. ప్రయాణ దూరం ఎక్కువగా ఉండటం వల్ల ఇంధన ఖర్చులతో పాటు బీమా ప్రీమియంలు మరింత భారమవుతాయి. దీంతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. హర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ఇప్పటికే అక్కడ అంతరాయం నెలకొంది. ఒకవేళ బాబ్ ఎల్-మండేబ్ కూడా మూతపడితే ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు తెగిపోయి.. చమురు, గ్యాస్ కొరత తీవ్రత మరింత పెరుగుతుంది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు సక్సెస్ కాకపోతే ప్రపంచ ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us