BIG BREAKING: సంచలన నిర్ణయం.. CBSE పరీక్షలు రద్దు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, UAE, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లో జరగనున్న సీబీఎస్సీ పరీక్షలు రద్దు చేసింది.

New Update
CBSE announces cancellation of Class 12 board exams in Middle east region

CBSE announces cancellation of Class 12 board exams in Middle east region

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి సెంట్రల్ బోర్డ్‌ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, UAE, ఒమాన్, బహ్రెయిన్ దేశాల్లో జరగనున్న సీబీఎస్సీ పరీక్షలు రద్దు చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 10 వరకు జరగాల్సిన 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇంతకుముందు వాయిదా పడిన 10వ తరగతి బోర్డు పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

Also Read: వీసా కోసం వింత డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్!

అయితే అభ్యర్థులకు ఫలితాలు ఎలా ప్రకటిస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని CBSE తెలిపింది. విద్యార్థులకు నిర్వహించిన యూనిట్ టెస్టులు, ప్రీబోర్డు, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ లాంటి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఫిబ్రవరి 28 ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయక్తంగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. దీంతో ఇరాన్ గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  

Also read: మా డ్రోన్లు కాపీ చేసి ఆ దేశాలపై దాడులు..ఇరాన్‌ సంచలన ఆరోపణలు

Advertisment
తాజా కథనాలు