/rtv/media/media_files/2025/07/07/arrest-2025-07-07-20-50-07.jpg)
acb officials- arrested- miryalaguda- deputy -tahashildar
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుండగా దుబాయ్‌లో 35 మంది అరెస్ట్ అయ్యారు. వారిలో 19 మంది భారతీయులు కూడా ఉన్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా తప్పుదారి పట్టించే సమాచారాన్ని, నకిలీ కంటెంట్‌ను వైరల్ చేస్తున్నారని UAE కఠిన చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో 19 మంది భారతీయ పౌరులతో సహా మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని అధికారులు ఆదేశించారు. దేశ భద్రత, ప్రజా క్రమాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది.
యూఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అల్ షంసీ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు మూడు వేర్వేరు టీంలుగా ఏర్పడి సమాజంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించారు. టీంల వివరాలు..
మొదటి బృందం (10 మంది): ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్నారు. వీరు క్షిపణులు దేశ గగనతలం గుండా వెళ్తున్నట్లు ఉన్న పాత లేదా ఇతర ప్రాంతాలకు చెందిన వీడియోలకు భయంకరమైన సౌండ్ ఎఫెక్ట్స్ జోడించి, దేశంపై దాడి జరుగుతోందనే భ్రమను కల్పించారు.
రెండవ బృందం (7 మంది): ఈ బృందంలోనూ ఐదుగురు భారతీయులు ఉన్నారు. వీరు AI టెక్నాలజీ ఉపయోగించి నకిలీ పేలుళ్లు, మంటలు, క్షిపణి దాడులు చేసినట్లు వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. జాతీయ జెండాలు, తేదీలను తారుమారు చేసి ఇవి యూఏఈలోనే జరిగినట్లుగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.
మూడవ బృందం (6 మంది): ఐదుగురు భారతీయులు ఉన్న ఈ బృందం, శత్రు దేశాల ఆర్మీ ఆపరేషన్ ప్రశంసిస్తూ, వారి రాజకీయ నాయకత్వాన్ని పొగుడుతూ పోస్ట్‌లు పెట్టింది.
వీరు కాకుండా మరో ఇద్దరు భారతీయులపై కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ వేగవంతం చేశారు. నిందితులందరినీ త్వరితగతిన విచారించేందుకు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. యూఏఈ చట్టాల ప్రకారం, ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష పడుతుంది. 100,000 దిర్హామ్‌ల (సుమారు రూ. 22 లక్షలకు పైగా) జరిమానా విధించే అవకాశం ఉంది.
కొన్ని వీడియోలు పిల్లల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉండటమే కాకుండా, కీలకమైన జాతీయ సైనిక స్థావరాలపై దాడులు జరిగినట్లు తప్పుడు వాదనలు చేశాయని అధికారులు గుర్తించారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై పర్యవేక్షణను పెంచినట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై ఎటువంటి దయ చూపబోమని, జాతీయ భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. విదేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి చట్టాలను గౌరవించాలని, ధృవీకరించని సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Follow Us