Adam Britton: జువాలసిస్ట్ ఆడమ్‌కు 249 ఏళ్ల జైలు శిక్ష...ఎందుకో తెలుసా? 60 కి పైగా కుక్కలను తీవ్రంగా హింసించి..అత్యాచారం చేసి వాటిని అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో జువాలసిస్ట్ ఆడమ్ బ్రిటన్ కి ఆస్ట్రేలియాలో అతనికి 249 ఏళ్ల జైలు శిక్ష పడింది.జంతు హింసకు సంబంధించి తనపై వచ్చిన 60కి పైగా నేరారోపణలను ఆడమ్ స్వయంగా అంగీకరించాడు. By Bhavana 15 Jul 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Adam Britton: క్రొకొడైల్ ఎక్స్పర్ట్‌గా అతనికి మంచి పేరు, గుర్తింపు ఉన్నాయి. అతనో గొప్ప జువాలసిస్ట్ అని యావత్ ప్రపంచం అతనిని గుర్తించింది. కానీ అతనిలో ఉన్న , ప్రపంచానికి తెలియని రాక్షసుడి గురించి తెలిసి ఏంటి వీడు ఇంత నీచుడా అని యావగించుకున్నారు. అతనే ఆడమ్ బ్రిటన్. అతనిలోని క్రూరత్వం, రాక్షసత్వం చాలా కాలం తరువాత బయటకు వచ్చింది. ఒక్కటి కాదు..రెండు కాదు..ఏకంగా 60 కి పైగా కుక్కలను తీవ్రంగా హింసించి..వాటిని అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఓ గదిలో బంధించి మరీ వాటిని కనికరం లేకుండా హింసించేవాడు. ఓ జువాలసిస్ట్ అయ్యుండి.. మరీ ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా? అంటూ అందరూ షాక్‌కి గురయ్యారు. మూగజీవాట పట్ల ఆడమ్ చేసింది ఘోరమైన నేరం కావడంతో.. ఆస్ట్రేలియాలో అతనికి 249 ఏళ్ల జైలు శిక్ష పడింది. గతేడాది.. జంతు హింసకు సంబంధించి తనపై వచ్చిన 60కి పైగా నేరారోపణలను ఆడమ్ స్వయంగా అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే కోర్టు అతనికి ఆ శిక్ష విధించింది. అయితే.. తన క్లయింట్ శిక్షను తగ్గించాలని కోరుతూ.. ఆడమ్ తరఫు లాయర్ కోర్టుని ఆశ్రయించాడు. జడ్జికి ఒక కొత్త రిపోర్టుని సమర్పించి, దానిని పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. ఈ కేసు విచారణలో భాగంగా.. ‘ఇది జంతువుల పట్ల వింత క్రూరత్వం’ అంటూ న్యాయమూర్తి మేఖైల్ గ్రాంట్ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టుకి వాయిదా వేశారు. ఈ కేసు తుది తీర్పు కోసం వేచిచూస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆడమ్ తరఫు లాయర్ మాట్లాడుతూ.. తన క్లయింట్ ఒక విచిత్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ సమస్య అతనికి బాల్యం నుంచే ఉందని వివరించాడు. అందులో అతని తప్పేమీ లేదని కోర్టుకు తెలియజేశాడు. తాను సమర్పించిన రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకొని, న్యాయస్థానం తీర్పునిస్తుందని ఆశిస్తున్నానని, అతనికి శిక్ష తగ్గిస్తారని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో.. ఆడమ్‌పై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కుక్కలపై అతడు ప్రదర్శించిన కర్కశత్వానికి అతనిని కూడా అంతే కఠినంగా శిక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. Also read: ఘోర రోడ్డు ప్రమాదం… డీసీఎం ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధం! #australia #adam-britan #249-years మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి