YS Sharmila: గుడ్లవల్లేరు హిడెన్ కెమెరాల ఘటన.. షర్మిల సంచలన ట్వీట్..!

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హిడెన్ కెమెరాల ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. తక్షణమే ఉన్నతస్థాయి కమిటీ వేయాలని, సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila: చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల

YS Sharmila:  గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజి (Gudlavalleru Engineering College) అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని APCC చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందన్నారు. చదవు, సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసిందన్నారు. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే.. వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిందనడానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం.. కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు.. ఫాస్ట్రాక్ విచారణ జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలని.. సీనియర్ ఐపీఎస్ అధికారులతో విచారణ జరగాలని పేర్కొన్నారు.

బాత్ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలని.. రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందేనన్నారు. బాత్ రూముల్లో రికార్డ్ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్ కాకుండా చూడాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే తాను కాలేజీని సందర్శిస్తానని.. విద్యార్థినిలతో మాట్లాడుతానని.. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుందన్నారు.

Also Read: జగన్ కు ఊహించని షాక్.. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఔట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు