Sharmila: వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శనాస్త్రాలు.. మీ చేతకాని తనానికి ఇలా అడుగుతున్నారా? అంటూ ఫైర్ వైసీపీ ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదని మండిపడ్డారు. By Jyoshna Sappogula 15 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YS Sharmila: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేశారే తప్ప.. అభివృద్ధి చూపలేదంటూ ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రాజధాని లేదు.. ప్రత్యేక హోదా రాలేదని అన్నారు. పోలవరం పూర్తి కాలేదు, ప్రత్యేక ప్యాకేజీలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ..ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు! కనీసం జలయజ్ఞం పెండింగ్ ప్రాజెక్టులకు కూడా దిక్కులేదని పేర్కొన్నారు. కొత్త పరిశ్రమలు లేవు.. ఉన్నవి ఉంటాయో లేదో తెలియదని దుయ్యబట్టారు. ఉమ్మడి రాజధాని మరో రెండేళ్లు కావాలని అడుగుతున్నారంటే ఇన్నాళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమినట్లా ? అంటూ విరుచుకుపడ్డారు. మోదీకి మోకరిల్లి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారే కానీ విభజన హామీలపై ఏనాడూ నోరు విప్పలేదని మండిపడ్డారు. ఆంధ్రుల రాజధాని ఎక్కడా అని అడిగితే 10 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్ వైపు చూపించే దయనీయ పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. Also Read: కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వం కాగ్ నివేదిక చంద్రబాబు అమరావతి పేరుతో చూపించింది 3D గ్రాఫిక్స్ అయితే.. మూడు రాజధానుల పేరుతో జగనన్న ఆడింది మూడు ముక్కలాట అని ఎద్దేవ చేశారు. పూటకో మాట, రోజుకో వేషం అంటూ దుమ్మెత్తిపోశారు. వైసీపీ నేతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునే కుట్రలో భాగమే ఉమ్మడి రాజధాని అంశం అని ఆరోపించారు. ఓటమి ఖాయమని తెలిసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం తప్పా.. వైసీపీ కి రాజధానిపై, రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ది లేదని ఫైర్ అయ్యారు. #sharmila #andhra-pradesh-cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి