YS Sharmila:  ఏపీలో రైతుల పరిస్థితి ఇదే..వైసీపీ ప్రభుత్వంపై షర్మిల విమర్శలు..!

గుంటూరు జిల్లా కొలకలూరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు పెద్ద మాఫియా అని ఆరోపించారు.

New Update
YS Sharmila: ఏపీ సీఎం జగన్ పై దాడి దురదృష్టకరం..వైఎస్ షర్మిల ట్వీట్..!

YS Sharmila: ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. తాజాగా, రాష్ట్రంలో తొలి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. తొలి సమావేశం గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని నిర్వహించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. ఈ క్రమంలో భూ యాజమాన్య హక్కు చట్టం 2023 రద్దు చెయ్యలని షర్మిలకు వినతిపత్రం అందజేశారు తెనాలి భార్ అసోసియేషన్ సభ్యులు.

Also Read: నో డౌట్.. ఈ రెండో యాత్ర సినిమా వైసీపీకి బూస్టర్ డోస్

అనంతరం షర్మిల మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా మాట్లాడి తెలుసుకోవటానికి వచ్చానన్నారు. సమస్యలు చెప్పటం ద్వారా నేరుగా ప్రభుత్వం, అధికారుల దృష్టికి వెళ్తుందన్నారు. పెన్షన్, నిత్యావసర ధరల పెరుగుదల, ఇళ్ల స్థలాల సమస్యలు, తదితర సమస్యలు షర్మిలకు తెలియజేవారు. గ్రామంలో నీళ్ళు, డొంక రోడ్లు, రహదారులు, కాల్వ ల సమస్యలు ప్రధానంగా వున్నాయని గ్రామస్థులు రచ్చబండలో షర్మిలకు ఫిర్యాదు చేశారు.

Also Read: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్.. వైసీపీ నాయకుడికి మంత్రి గుమ్మనూరు జయరాం బెదిరింపులు..!

ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కొనుగోలు పెద్ద మాఫియా అని ఆరోపించారు. తెనాలి నియోజకవర్గంలో 32వేల మందికి ఇళ్లు మంజూరు అయ్యాయని.. అయితే, వాటిలో ఎన్ని ఇళ్లు నిర్మాణం అయ్యాయో చెప్పాలనీ ప్రజలను అడిగారు. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు, సబ్సిడీ విత్తనాలు, గిట్టు బాటు ధర, పంట నష్టరిహారం, పంట భీమా ఇలా ఏవీ లేవని..దీని వల్ల రైతులు అప్పుల పాలు అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం బాగుంది అని ఏ ఒక్క రైతైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రైతుల పరిస్థితి అతి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు