YS Sharmila: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల కీలక వ్యాఖ్యలు

AP: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల తొలిసారి స్పందించారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ప్రతి ఆడబిడ్డకూ ఉంటుందని అన్నారు. కొంతమంది వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా.. చెల్లికి కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించేవారూ ఉన్నారని సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు.

New Update
YS Sharmila: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల కీలక వ్యాఖ్యలు

YS Sharmila: సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తొలిసారిస్పందించారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ప్రతి ఆడబిడ్డకూ ఉంటుందని అన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన బాధ్యత అన్నకూ ఉంటుందని పేర్కొన్నారు. చెల్లెకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా బావిస్తున్నారని.. తమ వాటాను చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తున్నామని బిల్డప్‌ ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు. కొంతమంది వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా.. చెల్లికి కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపించేవారూ ఉన్నారని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలేంటో మా కుటుంబానికి, ఆ దేవుడికే మొత్తం తెలుసు అని అన్నారు. మా పోరాటం ఆస్తుల కోసం కాదు.. న్యాయం కోసం వ్యాఖ్యానించారు.

ALSO READ: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు

జగన్ వద్ద షర్మిల అప్పు..

కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఈరోజు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్ లో షర్మిల తెలిపిన వివరాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. తన అన్న సీఎం జగన్‌ నుంచి రూ.82.58 కోట్లు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే తన వదిన భారతి వద్ద రూ.19.56 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిపారు. అలాగే తన భర్త అనిల్‌కు రూ.30 కోట్లు అప్పుగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. విజయమ్మ నుంచి రూ.40 లక్షలు షర్మిల భర్త అనిల్ అప్పుగా తీసుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు