Jagan : కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై జగన్‌ రియాక్షన్‌.. ఆధారాలతో సహా..

మాజీ సీఎం జగన్‌ మరికాసేపట్లో ప్రెస్‌మీట్‌ పెట్టనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులపై లెక్కలతో సహా వివరించనున్నట్లు తెలుస్తోంది. మద్యం స్కీమ్‌పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే. వీటిపై కూడా వివరణ ఇస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

New Update
Jagan : కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై జగన్‌ రియాక్షన్‌.. ఆధారాలతో సహా..

YS Jagan Sensational Press Meet :  వైసీపీ (YCP) హయాంలో అక్రమాలు, అవినీతిపై వరుసగా కూటమి ప్రభుత్వ శ్వేతపత్రాలపై  కాసేపట్లో మాజీ సీఎం జగన్‌ (YS Jagan) ప్రెస్‌మీట్‌ పెట్టనున్నారు. మద్యం స్కీమ్‌ (Liquor Scam) పై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించిన సంగతి తెలిసిందే. TDR బాండ్లు, ఇసుక అక్రమ రవాణాపైనా పలు ఆరోపణలు వినిపించారు.

కాగా, తనను చంపాలనుకుంటే చంపేయాలని కార్యకర్తలపై దాడులు కరెక్ట్‌ కాదని ఢిల్లీలో జగన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన దాడులపై లెక్కలతో సహా జగన్‌ ప్రెస్‌మీట్‌ లో వివరిస్తారని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.

Also Read : నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment