AP: వైసీపీ ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్..! వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి హృదయం నేడు గర్వంతో నిండే రోజు అని అన్నారు. By Jyoshna Sappogula 15 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Guntur: గుంటూరు జిల్లాలో వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ప్రతిపక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడదల రజనీ, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Also Read: నేటి స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ వికసిత భారత్ మాజీ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి హృదయం నేడు గర్వంతో నిండే రోజు అని అన్నారు. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజని.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2024 #jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి