తాగింది నిజమే.. వీడియో తీసింది అందుకే..యూట్యూబర్ నాని సంచలన ప్రెస్ మీట్!

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌ ఘటనతో తనకూ ఏ మాత్రం సంబంధం లేదని లోకల్ బాయ్‌ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాగిన మైకంలో తాను తగలబడిపోతున్న బోట్లను ఎలా సేవ్ చేయాలో తెలియలేదన్నాడు. వీడియో తీస్తే ప్రభుత్వంకు ప్రజలకు జరిగిన విషయం తెలుస్తుందనే వీడియో తీశానని స్పష్టం చేశారు.

New Update
తాగింది నిజమే.. వీడియో తీసింది అందుకే..యూట్యూబర్ నాని సంచలన ప్రెస్ మీట్!

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఆగిప్రమాదానికి తనకూ ఏ మాత్రం సంబంధం లేదని లోకల్ బాయ్‌ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. కావాలనే ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. తాను ఏ తప్పూ చేయలేదని అన్నాడు. 19వ తేదీ రాత్రి తన భార్య సీమంతం కావడంతో వేరే ప్లేస్ లో ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చానని తెలిపాడు. అయితే, ఆ సమయంలోనే తనకు ఫోన్ రావడంతో యాక్సిండెంట్ స్పాట్ కు వెళ్లనని చెప్పాడు. అయితే, తాను అక్కడికి వెళ్లే సరికి బోట్లు అన్ని తగలబడిపోతున్నాయన్నాడు. అది చూసి ఏడ్చుకుంటూ నేరుగా తన బోటు దగ్గరకు వెళ్లానని వివరించాడు.

Also Read: తులసివనంలో గంజాయ్ మొక్క పువ్వాడ అజయ్..సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

తనకు రెండు బోట్ల ఉన్నాయని వెల్లడించాడు. అందులో ఒకటి కాలిపోతుండగా.. ఇంకో బోటు సేఫ్ గా ఉందని తెలిపాడు. 'నేను డ్రింక్ చేసింది వాస్తవమే అది నేను ఒప్పుకుంటాను. నా భార్య శ్రీమంతం కావడంతో నేను తాగాను. తాగిన మైకంలో ఉన్న నేను..తగలబడిపోతున్న బోట్లను ఎలా సేవ్ చేసేది? ఒకవేళ నేను సేవ్ చేయడానికి వెళ్తే మళ్లీ నన్ను సేవ్ చేయడానికి ఇంకోకరు రావాల్సి ఉంటుంది. నేను ఉన్న పరిస్థితిలో ఎవరికి ఫోన్ చేయాలో తెలియలేదు. ఈ ప్రమాదం జరిగిందని ఎవ్వరికి కూడా తెలియదు.. కనీసం వీడియో తీస్తే గవర్నమెంట్ కు తెలుస్తుంది.. ప్రజలు జరిగిన విషయం తెలుసుకుంటారు...నష్టపోయిన మమ్మలిని ప్రభుత్వం ఆదుకుంటుందనే ఉద్దేశం తోనే వీడియో తీశాను తప్పా...యూట్యుబ్ లో పెట్టాడానికి కాదు' అని అన్నాడు. అంతేకానీ, ఆ వీడియోను క్యాష్ చేసుకోవడానికి ఏ మాత్రం కాదని స్పష్టం చేశాడు నాని.

'గంగ పుత్రులకు సహాయం అందుతుంది అనే హోప్ తోనే విడియో తిసి పెట్టాను. అది కూడా.. 22 సెకండ్స్ మాత్రమే తీశాను. యూట్యూబ్ లో పెట్టుకోవడానికి చేసుంటే డైరెక్ట్ లైవ్ పెట్టేవాడిని. ఆ వీడియో తీసిన వెంటనే బోట్లను కాపాడాటానికి నా వంతు నేను కృష్టి చేశాను. కొంతమంది ఈ టైంలో వీడియో ఏంటి అని నన్ను కొట్టాడానికి వచ్చారు. అయితే సంఘటన తర్వాత నేను ఇంటికి వెళ్తే..క్రైమ్ పోలీసుల నుండి ఫోన్ వచ్చింది. విచారణకు రమ్మని పిలిచారు. అయితే, చిన్న ఎంక్వైరీ అని తీసుకుని వెళ్ళి..ఎందుకు బోట్లు తగలబెట్టావని నన్ను ప్రశ్నించారు. నేను తగలబెట్టలేదు సార్ అని ఎంత చెప్పినా వినకుండా నన్ను కొట్టారు. నేను చెయ్యలేదని ఏడ్చాను..నువ్వే చేశావ్ అని తిట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో నేను ఎక్కడ ఉన్నానో కుడా సీసీ కెమెరాలో రికార్డు అయింది. అన్ని చూసిన తర్వాత కూడా పోలీసులు నీ ఫ్రెండ్స్ తో నువ్వే చేపించావ్ అని అంటున్నారు. మరో నలుగురిని కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. నేను కోర్ట్ కి రాకపోతే నన్ను ఏదో చేసేసే వారు. నేను చెయ్యకుండానే నేనే ఈ ప్రమాదం చేసినట్లు క్రియేట్ చేస్తున్నారు. హై కోర్ట్ లో పిటిషన్ వెయ్యగానే నన్ను బెదిరించారు. హై కోర్ట్ లో న్యాయం జరుగుతుంది.

నా జీవనోపాధి అయిన బోట్లను నేనే ఎలా తగలబెడుతాను అంటూ ప్రశ్నించారు. వైజాగ్ వెళ్ళాక నాపై ఎటాక్ కుడా చెయ్యొచ్చు..మా అన్న పై కూడా కొంతమంది రాళ్ల దాడి చేశారు. నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది..నిజ నిజాలు తెలుసుకోకుండా నాపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. గంగ పుత్రులు నన్ను నమ్మండి నేను ఏ తప్పు చేయలేదు..కావాలనే నన్ను ఇరికించారు' అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు