Tirupati: ఎటు చూసినా ప్రమాదకరమైన రోడ్డు .. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం

తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

New Update
Tirupati: ఎటు చూసినా ప్రమాదకరమైన రోడ్డు .. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణం

మన రోడ్డు మన భాధ్యత అంటూ...రండి కదలి రండి గ్రామస్తులకు పిలుపునిచ్చిన గ్రామ యువత రోడ్డుపై శిబిరాలు ఏర్పాటు చేసుకుని ధర్నా నిర్వహించారు. తిరుపతి జిల్లా (Tirupati district) సత్యవేడు నియోజకవర్గం (Satyavedu Constituency)  నాగలాపురం (nagalapuram) నుంచి చిన్నపాండూరు ( Chinnapandur) వరకు 22 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ కోసం వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల క్రితం 32 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ పనుల కోసం ఉమ్మడి జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ గురుమూర్తి చేతుల మీదుగా 2021లో శిలాఫలకం వేశారు.

అయితే.. పనులు శిలాఫలకానికే పరిమితమైంది. మూడేళ్లు కావస్తున్న ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. రోడ్డుపైన గుంతలు కాస్త చెరువులుగా మారాయి. 20 కిలోమీటర్ల మీద అడుగడుగునా చెరువులు దర్శనమిస్తున్నాయి. సుమారు 20 గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించాల్సి ఉంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు (Leaders of opposition parties) పలుమార్లు ధర్నాలు, నిరసనలు నిర్వహించిన ప్రభుత్వం లో చలనం లేకుండా పోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎటు చూసినా రోడ్డు ప్రమాదకరంగా మారి ప్రజలు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇక కళాశాలకు, పాఠశాలకు (youth and students) వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో ఈరోజు బీరుగొప్పం గ్రామానికి చెందిన యువకులు విద్యార్థులు రోడ్డుపై టెంట్లు వేసి ధర్నా నిర్వహించారు.

విషయం తెలుసుకున్న నాగలాపురం ఎస్ఐ ఓబయ్య, ఏఎస్ఐ రవి (ASI Ravi) సిబ్బందితో కలిసి ధర్నా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో ఎస్సై (SI ) చర్చించిన ఫలితం లేకుండా పోయింది. సంబంధిత ప్రజాప్రతినిధులు (Representatives people) వచ్చి తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ధర్నా విరపించబమని తేల్చి చెప్పారు. అయితే ఎస్ఐ ఓబయ్య (SI Obayya) శిబిరాలు తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేసులు నమోదు (Registration cases) చేస్తామని హెచ్చరిస్తూ యువకులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సిబ్బందితో టెంట్లను పీకేశారు. దీంతో పోలీసులకు యువకులకు మధ్య తీవ్రవాగతం నెలకొని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా యువకులు  (youth)ససేమిరా అంటూ ధర్నా నిర్వహించారు.

ఇది కూడా చదవండి: పెద్దపల్లిలో దారుణం..కోతులకు విషం పెట్టి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

Advertisment
Advertisment
తాజా కథనాలు