Breath Lock: ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ ల కాలం పోయింది..ఇప్పుడు ఏకంగా బ్రీత్ తోనే! రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్లను బ్రీత్ ద్వారా ఓపెన్ చేయవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్ లు వివిధ మార్గాల్లో ఓపెన్ చేస్తుండడంతో వాటి వల్ల అంత సెక్యూరిటీ లేదని భావించి కొత్త టెక్నాలజీని తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. By Bhavana 18 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Breath Lock: ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్లలో నంబర్ లాక్, ప్యాటర్న్ లాక్, ఫింగర్ ప్రింట్ లాక్ (Fingerprint Lock) , ఫేస్ లాక్ లు(Face Lock) వచ్చాయి. వీటిని తీయడం చాలా కష్టమని నిపుణులు భావించినప్పటికీ అవి ఎంతో తెలికగా తీయవచ్చని కొందరు నిరూపించారు. నంబర్ లాక్ , ప్యాటర్న్ లాక్ ను చాలా మంది చాలా ఈజీగా తీసేసి ఫోన్లను అన్ లాక్ చేసేస్తున్నారు. అయితే వాటిని అధిగమించేందుకు ఫింగర్ ప్రింట్, ఫేస్ లాక్‌లను ఏర్పాటు చేస్తే ఫోన్ గలవారు నిద్ర పోయినప్పుడు వారి వేలిముద్రలను ఉపయోగించి ఫోన్ అన్ లాక్ చేస్తున్నారు. దానిని అధిగమించడం కోసం ఫేస్ లాక్ సెక్యూరిటీ (Security) ని అప్ డేట్ (Update) చేస్తే దానిని అయితే ఫోటోలు చూపించి మరీ అన్‌లాక్ చేసేస్తున్నారు. అంతా సేఫ్ కాదని.. ఈ క్రమంలోనే ఈ సెక్యూరిటీ ఫీచర్స్ అంతా సేఫ్ కాదని తెలిశాయి. దీంతో మరో కొత్త ఫీచర్ తెర మీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏంటో తెలుసా..బ్రీత్ లాకింగ్. అవును త్వరలో మన ఊపిరితో ఫోన్ ను అన్ లాక్ చేసేందుకు వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్వాసకి సంబంధించిన డేటాతో.. దీని వల్ల ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఫోన్ ను అన్‌లాక్ చేయలేకపోవడం దీని వెనుక ఉన్న ప్రయోజనమని దీనిని ప్రయోగించిన చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మహేష్ పంచాగ్నుల అతని టీం వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..గాలి ఒత్తిడి సెన్సార్ నుంచి సేకరించిన శ్వాసకి సంబంధించిన డేటాతో ప్రయోగం చేయడం జరిగిందంట. ఈ డేటా సాయంతో ఏఐ రూపొందించడం మాత్రమే ఈ టీం లక్ష్యం. ఈ బృందం వారి ఏఐ మోడల్ ఒకరి శ్వాస డేటాను విశ్లేషించిన తరువాత అది విశ్లేషించిన శ్వాస ఆ వ్యక్తికి చెందిందో కాదో 97 శాతం కచ్చితత్వంతో ధృవీకరిస్తుందని చెబుతున్నారు. ప్రతి వ్యక్తి యొక్క శ్వాస వేవ్స్ భిన్నంగా ఉండడం వల్ల ముక్కు నోరు గొంతు ద్వారా ఉత్పన్నమయ్యే వేవ్స్ ను సెన్సార్ బాగా గుర్తించగలదని వారు వివరించారు. Also read: మేనల్లుడి నిశ్చితార్థానికి హాజరుకానున్న జగన్! #technology #ai #breath-lock #facelock #fingerprint-lock మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి