Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి!

యెమెన్‌ తీరంలో వలస కార్మికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా..ఇద్దరు సిబ్బందితో కలిసి 14 మంది గల్లంతయ్యారు. వీరంతా తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.

New Update
Boat Accident : పడవ బోల్తా..13 మంది మృతి!

Yemen : యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. యెమెన్‌ తైజ్‌ ప్రావిన్స్‌ (Yemen Taiz Province) తీరంలో మగళవారం పడవ బోల్తా (Boat Accident) పడడంతో 13 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 25 మంది ఉన్నారు. మిగిలిన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్ మైగ్రేషన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..యెమెన్‌ లోని తైజ్‌ ప్రావిన్స్‌ తీరంలో వలస కార్మికుల పడవ బోల్తా పడింది.

ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం (East Asia Country) ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుంచి వలస కార్మికులతో బయల్దేరింది. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

గల్లంతైన వారి కోసం అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పడవ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. యెమెన్‌లోని IOM మిషన్ తాత్కాలిక అధిపతి మాట్లాడుతూ.. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని వివరించారు.

Also Read: ఘోర ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

దుబాయ్ నుంచి వచ్చిన భర్తను ప్రియుడితో కలిసి భార్య రజియా చంపేసింది. బాడీని ముక్కలు చేసి భర్త తెచ్చిన బ్యాగ్‌లోనే ప్యాక్ చేసి ఊరికి 55KM దూరంలో పడేశారు. ఎయిర్‌పోర్ట్‌లో QRకోడ్‌ స్టికర్ బ్యాగ్‌పై ఉంది. దానితోనే పోలీసులు కేసు చేధించారు. వారిని అరెస్ట్ చేశారు.

New Update
Uttar Pradesh Deoria

Uttar Pradesh Deoria

విదేశాల నుంచి తిరిగొచ్చిన భర్తను భార్య చంపి ముక్కలు ముక్కలు చేసింది. చివరికి అతను తెచ్చిన బ్యాగ్‌లో ప్యాక్ చేసి 55 కిలో మీటర్ల దూరంలో వేసింది. ఎంత పెద్ద క్రైమ్ చేసిన ఏదో ఓ చిన్న తప్పుతో దొరికిపోతారనే పోలీసుల మాట నిజమైంది. రజియా తన అక్రమ సంబంధానికి కొనసాగించేందుకు భర్త అడ్డు తొలగించుకోవాలని చూసింది. పక్కా ప్లాన్‌తో లవర్, అతని మేనల్లుడితో కలిసి భర్త నౌషాద్ అహ్మద్‌‌ను చంపి సూట్‌కేస్‌లో పెట్టింది. దాన్ని ఊరికి 55 కిలో మీటర్ల దూరంలో పడేశారు.

Also read: Woman kills husband: భర్తకు ఛాయ్‌లో ఎలుకల మందు.. పింటూతో నలుగురు పిల్లల తల్లి లవ్ ట్రాక్

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఇది చోటుచేసుకుంది. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిని అతని భార్య, ఆమె లవర్ హత్య చేశారు. బాధితుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ట్రాలీ బ్యాగ్‌లో ప్యాక్ చేశారు. దాన్ని ఇంటి నుండి 55 కిలోమీటర్ల దూరంలో పడేశారు. తార్కుల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్ఖౌలి గ్రామంలో ఏప్రిల్ 21న తన పొలంలో అనుమానాస్పద బ్యాగ్ చూసి రైతు జితేంద్ర గిరి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి బ్యాగ్‌ తెరిచి చూస్తే.. ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిన మొండెం, కాళ్ల కనిపించాయి. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ఉంది. మృతదేహం గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. ఆ బ్యాగ్‌కు ఒక క్యూర్ కోడ్ ఉంది. అది ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ చెక్కింగ్ సమయంలో వేసింది. ఈ క్యూఆర్ కోడ్‌తో పోలీసులు కేసు ఛేదించారు. 

Also read: ACB caught: అడ్డంగా బుక్కైన మణుగూరు CI.. ఏసీబీకి ఎలా దొరికాడంటే?

విమానాశ్రయ అధికారులతో బార్‌కోడ్‌ను ట్రాక్ చేస్తే మృతుడు మెయిల్ పోలీస్ స్టేషన్‌లోని భటౌలి గ్రామానికి చెందిన నౌషాద్ అహ్మద్‌(38)గా గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భార్య పోలీసుల ముందే భర్త కనిపించడం లేదని ఏడ్చింది. పోలీసులు ఇంట్లో వెతికగా.. రక్తపు మరకలతో ఉన్న మరో సూట్‌కేస్ దొరికింది. ఆమె ఆస్కార్ ఫర్మామెన్స్‌పై పోలీసులకు అనుమానం వచ్చి వారి స్టైల్లో విచారించారు. దీంతో రజియా, ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. భర్తకు స్కెచ్ వేసిన రజియా అతను దుబాయ్ నుంచి తెచ్చిన అదే బ్యాగ్‌ వాడి దొరికిపోయింది. ఆమె మేనల్లుడు రుమాన్‌లో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా వస్తు్న్నాడని హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం అయ్యింది ఈ భార్యలకు.. మానవ విలువలు మట్టికలిసిపోతున్నాయా? నెల వ్యవధిలోనే ఇది ఐదో హత్య. మీరట్‌లో సౌరభ్, అమిత్ కశ్యప్, బరేలీలో కేహర్ సింగ్, హర్యానాలో ప్రవీణ్.. ఇప్పుడు నౌషాద్ అహ్మద్‌. వీరంతా భార్యల  వివాహేతర సంబంధానికి బలైన బాధితులు. ఈ వార్తలు విని పెళ్లీడుకు వచ్చిన యువకులు వివాహం చేసుకోవాలంటే భయంతో వణుకుతున్నారు. బతికుంటే జీవితాంతం.. ఇలా సింగిల్‌గానైనా ఉండొచ్చని అనుకుంటున్నారు.

Also read: Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

(latest-telugu-news | crime news | wife cuts husband dead body)

 

 

Advertisment
Advertisment
Advertisment