Andhra Pradesh : నేడు స్పీకర్ ముందుకు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు.. అనర్హత వేటుపై కీలక నిర్ణయం ?

వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఇవాళ ఏపీ స్పీకర్‌ ముందు హాజరుకానున్నారు. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారిపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

New Update
Guntur YCP: గుంటూరులో వైసీపీ నేతలపై ఈసీకి ఫిర్యాదు

YCP Rebel MLA's : నేడు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు(YCP Rebel MLA's) ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌ ముందు హాజరుకానున్నారు. వారి అనర్హత వేటుపై స్పీకర్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్పీకర్‌ పంపిన నోటీసులపై వారు ఇవ్వనున్నారు. అయితే ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలు లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ చీఫ్‌ విప్ ప్రసాద రాజు(Prasada Raju) కూడా స్పీకర్ ఎదుట హాజరుకానున్నారు.

Also Read : అర్ధరాత్రి అమిత్ షా ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే

అనర్హత వేటు వేస్తారా ?

ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ప్రసాద రాజు ఇప్పటికే ఆధారాలు ఇచ్చారు. అయితే స్పీకర్ నుంచి ఇంతవరకు నోటీసులు అందలేదని మరో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ఈయన హాజరు అవుతారా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారా లేదా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఇప్పటికే హైకోర్టులో అనర్హత వేటుపై విచారణ కొనసాగుతోంది.

పొత్తులు 

ఇదిలా ఉండగా.. మరో రెండు మూడు నెలల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు(Lok Sabha, Assembly Elections) జరగనున్న వేళ.. ఏపీ(AP) లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రెండోసారి అధికారంలోకి రావాలని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు వైసీపీని గద్దె దించే లక్ష్యంగా టీడీపీ-జనసేన(TDP-Janasena) పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah) ను కూడా కలిశారు. బీజేపీని కూడా వీళ్లు తమ పొత్తులో కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఏపీ ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.

Also Read : కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!

Advertisment
Advertisment
తాజా కథనాలు