Vijayasaireddy comments: టీడీపీ చేపట్టిన బంద్‌ను హెరిటేజ్ కూడా పట్టించుకోలేదు.. విజయసాయి చురకలు!

టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన శైలీలో కౌంటర్లు వేశారు. ఏపీ స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం.. ఆ తర్వాత టీడీపీ బంద్‌కు పిలుపునివ్వడంపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్ది హాట్‌ కామెంట్స్ చేశారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.

New Update
Vijayasaireddy comments: టీడీపీ చేపట్టిన బంద్‌ను హెరిటేజ్ కూడా పట్టించుకోలేదు.. విజయసాయి  చురకలు!

Vijayasaireddy comments on chandrababu naidu over skill development scam case:డబ్బు ఉంటేనే రాజకీయాలు అనే విధంగా చేసిన వ్యక్తి ఆయనేనంటూ మండిపడ్డారు. స్వతహాగానే నేరస్తుడైన చంద్రబాబు చెయ్యని నేరాలు లేవన్నారు. ప్రతి వ్యవస్థలో తన మనుషులను పెట్టుకొని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన 14ఏళ్లలో ప్రతి సంవత్సరం ఒక స్కామ్ జరిగిందని ఆరోపించారు విజయసాయి. లోకేశ్‌ కూడా చంద్రబాబు నీతిమంతుడు అని చెప్పలేడన్నారు. 321 కోట్లలో ఒక్కరూపాయి కూడా సిమెన్స్ కంపెనీకి రాలేదని ఆ సంస్థ చెబుతోందని.. చంద్రబాబు అరెస్ట్‌పై తెలుగుదేశం నాయకులే నోరు విప్పడం లేదన్నారు. అందుకే ఇతర రాష్ట్రాల నాయకులను పిలుస్తున్నారని.. వాళ్లకు స్పెషల్ ఫైయిట్స్ పెడుతున్నారన్నారు. చంద్రబాబు ఒక ఆర్గనైజైడ్ క్రిమినల్ అని.. ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి జగన్ చెప్పారన్నారు. చంద్రబాబు క్రిమినల్‌గా మారడా‌నికి కారణం రామోజీరావే కారణమని చెప్పారు. చంద్రబాబు చేసిన ప్రతి నేరాన్ని ప్రోత్సహించిందే రామోజీరావేనని.. చంద్రబాబు చేసిన ప్రతినేరంలో రామోజీరావు హస్తం కూడా ఉన్నదన్నారు విజయసాయిరెడ్డి. రామోజీపైరావు కూడా ఎంక్వైరీ జరగాలన్నారు.

పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ కోవర్ట్ లాగా పని చేస్తున్నారని... బీజేపీలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి కోవర్ట్‌లే ఉన్నారన్నారు. ప్రభుత్వం కక్ష సాధించాలనుకుంటే జీవితకాలం బయటకు రాలేడన్నారు విజయసాయిరెడ్డి. జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్ది తిరుగులేని నాయకుడు... ఆయన నాయకత్వలోనే జిల్లా నాయకులు ప‌ని చేస్తారన్నారు. చంద్రబాబుని త్వరలో పోలీస్ కష్టడీకి ఇస్తారని.. అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పారు విజయసాయిరెడ్డి.

రోజా ఫైర్:
ఎవరు ఎన్ని చెప్పినా చంద్రబాబు ఓ దొంగ, అవినీతిపరుడని మంత్రి రోజా మండిపడ్డారు. త్వరలో కూడా లోకేశ్‌ జైలుకు వెళ్లడం ఖాయమని.. అందుకే ఇవాళ బాలకృష్ణ వెళ్లి మీటింగ్ పెట్టుకున్నాడన్నారు రోజా. బాలకృష్ణ ఓ పిచ్చివాడని.. తనకు పిచ్చి ఉందని తానే సర్టిఫికెట్ తెచ్చుకున్న వ్యక్తి అని విమర్శలు గుప్పించారు. అనురాధ నాలెడ్జ్ నాకు కాదు నీకు ఉందో లేదో చూసుకో అంటూ కౌంటర్ వేశారు. భువనేశ్వరి నటనను ప్రజలను నమ్మే పరిస్థితి లేదని.. నందమూరి కుటుంబాన్ని వాడుకొని చంద్రబాబు ఎలా ఎదిగాడో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఉన్నది జైలు అనుకుంటున్నాడా తన ఇల్లు అనుకుంటున్నాడా అని చురకలంటించారు. వేడి నీళ్లు కావాలి ఏసీ కావాలి అంటే చట్టం ఆయన చుట్టం కాదని.. భిన్నాభిప్రాయాలు ఏ పార్టీ లో నైనా సహజమేనని చెప్పారు.

ALSO READ: జూనియర్‌ ఎన్టీఆర్ ఏమైపోయావ్..? నట్టికుమార్‌ హాట్ కామెంట్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు