ఆ భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు: ఎంపీ రెడ్డప్ప

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై రియాక్ట్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతోనే చంద్రబాబు.. ఈ దాడులు చేయిస్తున్నారని..

New Update
ఆ భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు: ఎంపీ రెడ్డప్ప

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై రియాక్ట్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతోనే చంద్రబాబు.. ఈ దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

హంద్రీ నీవా నుంచి కుప్పానికి రెండు నెలల సమయంలోనే మంచి నీళ్లు ఇస్తున్నామన్నారు ఎంప్పీ. దీన్ని తట్టుకోలేక కడుపు మంటతో దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మదమెక్కి ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ ప్రజలను, దేవున్ని నమ్ముకున్నారు. కానీ చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు నమ్మకున్నారని రెడ్డప్ప ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ గొప్ప మనసు వల్లే.. చంద్రబాబు మనుగడ సాధ్యమవుతుందన్నారు. జగన్ వల్లే రాయలసీమలో వలసలు ఆగాయని చెప్పారు. రాయలసీమలో సీఎం వైఎస్‌ జగన్‌ అభివృద్ధి పరుగులు పెట్టించారన్నారు. వారు వీరూ అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అంటూ ఎంపీ రెడ్డప్ప కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓటమికి ఖాయం అని జోస్యం చెప్పారు ఎంపీ. పట్ట పగలే పోలీసులపై దాడులు చేయించారు.. హత్యా రాజకీయాల చరిత్ర చంద్రబాబుదే అని విమర్శించారు. వంగవీటి రంగాను చంపించిన చరిత్ర చంద్రబాబుది అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ ఎంపీ రెడ్డప్ప.

Advertisment
Advertisment
తాజా కథనాలు