AP Elections 2024: టికెట్ విషయంలో నా ఆలోచన అదే.. వైసీపీ ఎంపీ మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు

మత్స్యకార సామాజిక వర్గం నేతలు సమావేశమై రేపల్లె టికెట్ ను మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాల్సిందేనని జగన్ ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మోపిదేవి.. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

New Update
AP Elections 2024: టికెట్ విషయంలో నా ఆలోచన అదే.. వైసీపీ ఎంపీ మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు

పార్టీ టికెట్ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ రావు (Mopidevi Venkata Ramana Rao) స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు పని కట్టుకొని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన సబ్జెక్టుపై మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తమ కులానికి సంబంధించిన కొందరు పెద్దలు తనపై ఉన్న అభిమానంతో సీటు కావాలని అడిగారని వివరించారు.
ఇది కూడా చదవండి: AP Elections 2024: వైసీపీకి షాక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ.. ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు?

2019 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ సీఎం జగన్ (AP CM Jagan) మంత్రి పదవి ఇచ్చారన్నారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల తనను రాజ్యసభకు పంపించారని వివరించారు. తమ కుల పెద్దలు కూడా రేపల్లె సీటుపై మాట్లాడవద్దని కోరుతున్నానన్నారు. మత్స్యకార సామాజిక వర్గం నేతలు ఇటీవల సమావేశమై మోపిదేవి వెంకటరమణకు సీటు ఇవ్వాలని వైసీపీని డిమాండ్ చేయడం చర్చనియాంశమైంది.

ఈ మేరకు నిన్న మత్స్యకార సంఘం నేతలు ఆర్టీవీతో మాట్లాడుతూ.. మోపిదేవికి టికెట్ ఇవ్వకపోతే మత్స్యకార సామాజిక వర్గం మొత్తం జగన్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. తమ ద్వారా గెలిచిన జగన్ మా సామాజిక వర్గ నేతలను పక్కన పెట్టడం ఏంటని వారు ప్రశ్నించారు. మోపిదేవి వెంకటరమణ మీద నియోజకవర్గంలో ఎక్కడా వ్యతిరేకత లేకున్నా.. సర్వేల పేరుతో జగన్ పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేవారు. మత్స్యకార సామాజిక వర్గానికి 25 సీట్లు కేటాయించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు