TDP-YCP : కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోం.. తలై రాజేష్ వార్నింగ్..! శ్రీకాకుళం జిల్లా పారంపేటలో వైసీపీ కార్యకర్త సత్తిబాబుపై టీడీపీ కార్యకర్త గణేష్ కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో సత్తిబాబు తలకు తీవ్రగాయాలు అయ్యాయి. రాజాం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి తలై రాజేష్ ఈ దాడిని ఖండించారు. కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. By Jyoshna Sappogula 28 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Srikakulam : శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం పారంపేట గ్రామంలో వైసీపీ(YCP), టీడీపీ(TDP) కార్యర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్త సత్తిబాబు(Satti Babu) పై టీడీపీ కార్యకర్త గణేష్ కర్రతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో సత్తిబాబు తలకు తీవ్రగాయాలు అవ్వడంతో వెంటనే అతడిని రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. Also Read: మంత్రి బుగ్గన నామినేషన్ ను రద్దు చేయాల్సిందే.. ఆస్పత్రిలో సత్తిబాబును ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్, ఎమ్మెల్సీ విక్రాంత్ పరామర్శించారు. అనంతరం రాజేష్ మాట్లాడుతూ.. వైసీపీ నామినేషన్ కోసం సత్తిబాబు ఎక్కువ మంది కార్యకర్తలను తీసుకువెళ్లాడనే టీడీపీ కార్యకర్త గణేష్ దాడి చేశాడని ఆరోపించారు. కార్యకర్తలు జోలికి వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భౌతిక దాడులకు పాల్పడే సంస్కృతి సరైనది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు. #ap-ycp #thalai-rajesh #satti-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి