Balineni: రాజకీయాలను చూస్తుంటే ఇరిటేషన్ వస్తోంది.. వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్ .!

రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని అసహనం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని. అందరూ కలిసి పని చేస్తానంటేనే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అంతే తప్ప మరో నియోజకవర్గం నుండి ఎట్టి పరిస్థితిలోనూ పోటీ చేయనని తేల్చి చెప్పారు.

New Update
AP: అందుకే వైసీపీలో ఇబ్బంది పడ్డా.. మాజీ మంత్రి బాలినేని ఎమోషనల్ కామెంట్స్..!

MLA Balineni Srinivasa Reddy : ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) మండిపడ్డారు. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కానీ, ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు చూడలేదన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని రూ. 50 లక్షలు పందెం పెట్టానని చెప్పారు. కానీ, తెలంగాణలో అన్ని జిల్లాలో తిరిగిన మా అబ్బాయి బీఆర్ఎస్ వస్తుందని అన్నాడని.. దీంతో, మా అబ్బాయి బాధపడకూడదని పెట్టిన పందెం క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే కచ్చితంగా ఏపీలో వైసీపీ వస్తుందని మా అబ్బాయి కూడా భావించారని అన్నారు. జగన్ రావాలని మా అబ్బాయి తపన పడుతున్నాడని వ్యాఖ్యనించారు.

Also Read: అమ్మో..అమలాపురమా.. ట్రాఫిక్ కు దండం అంటున్న జిల్లా వాసులు.!

ఈ క్రమంలోనే పోటీ చేస్తే ఒంగోలు నుండే పోటీ చేస్తా తప్పా.. మరో నియోజకవర్గానికి వెళ్ళను అని తేల్చి చెప్పారు. అందరూ కలిసి పని చేస్తానంటేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అది కూడా ఒంగోలులో 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని జగన్(Jagan) కి చెప్పానట్లు పేర్కొన్నారు. తాను నీతి మంతుడినని చెప్పడం లేదని.. కానీ, ఒంగోలు నియోజకవర్గంలో ఎలాంటి తప్పులు చేయలేదని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇస్తుంటే.. తీసుకోకుండా రాజకీయం చేయలేమన్నారు. ఒంగోలులో డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు కనీసం ఓటర్ లిస్టును కూడా వెరిఫై చేయడం లేదని.. ఎందుకో తనకు అర్ధం కావడం లేదని బాలినేని వ్యాఖ్యనించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు