AP Politics: 'జల రాజకీయాలు చేస్తున్నారు' వైసీపీ నేత సీరియస్.! ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై వైసీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీరు విడుదల చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 20 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Y. Vishweshwara Reddy: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పై ఉరవకొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గం లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ జల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నీరు విడుదల చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని.. పయ్యావుల కేశవ్ ధర్నాల పేరుతో హడావుడి చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద 30 వేల ఎకరాల్లో పంటల సాగు ఉందని.. పంటలు కాపాడేందుకు చర్యలు తీసుకుంటుంటే మీరెందుకు అడ్డుకుంటున్నారు? అని ఫైర్ అయ్యారు. పయ్యావుల కేశవ్ డబుల్ గేమ్ ఆపాలన్నారు. సరిగ్గా నీరు విడుదల చేసే సమయంలో కేశవ్ రాస్తారోకో, ధర్నా అంటూ రైతులను రెచ్చగొట్టి నీరు రాకుండా చేశాడని.. రైతుల పొట్ట కొడుతున్నారని ఫైర్ అయ్యారు. నీటి విడుదల కాకుండా వ్యాసపురం, నింబగల్లు వాళ్ళని రెచ్చగొట్టింది కేశవేనన్నారు. Also Read: రైతు బిడ్డ మిస్సింగ్..పోలీసుల సెర్చింగ్! నాలుగు రోజులుగా నీరు విడిచేందుకు టీడీపీ సర్పంచ్, ఇతర నాయకులను వైసీపీ నేతలు ప్రాధేయపడ్డారన్నారు. వారం నీరు వదిలితే 30 వేల ఎకరాల్లో పంట చేతికొస్తుందని..రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరన్నారు..ప్రభుత్వం ద్వారా తుంగభద్ర బోర్డు అధికారులతో మాట్లాడి అదనంగా ఒక టీఎంసీ కూడా తెచ్చామని వెల్లడించారు. హంద్రీనీవా ద్వారా సరాసరి రావాల్సిన నీరు 40 టీఎంసీలు కాగా ఈ సారి వర్షాభావ పరిస్థితులతో ఇప్పటి వరకు కేవలం 17 టీఎంసీలు వచ్చాయని తెలిపారు. అందులో కర్నూలు జిల్లా 2.5 టీఎంసీలు, అనంతపురం జిల్లా 10.417, కడప 00..టీఎంసీలు వాడుకోగా చిత్తూరు జిల్లా కేవలం 0.5 శాతమే తీసుకున్నారని చెప్పారు. కేశవ్ కు అవగాహన లేకే మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కేవలం రాజకీయ లబ్ధి కోసం రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. #andhra-pradesh #tdp-mla-payyavula-keshav #ycp-vishweshwara-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి