BIG BREAKING: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు. By V.J Reddy 26 Jun 2024 in గుంటూరు రాజకీయాలు New Update షేర్ చేయండి Pinnelli Ramakrishna Reddy: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ను పొడిగించాలని కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీసుకు తరలిస్తున్నారు. హైకోర్టు తీర్పు.. జైలే..! వైసీపీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన బెయిల్ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టులో 4 ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు పిన్నెల్లి. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో మూడు కేసులు నమోదు అయ్యాయి. పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేశారని ఒక కేసు, కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి విషయంలో కేసు, పాల్వాయిగేటులో నాగ శిరోమణిపై దాడికి సంబంధించి మరో కేసు మొత్తం మూడు కేసులు నమోదు అయ్యాయి. https://rtvlive.com/wp-content/uploads/2024/06/Pinnelli.png" width="1280" height="720" mp4="https://rtvlive.com/wp-content/uploads/2024/06/WhatsApp-Video-2024-06-26-at-3.47.36-PM.mp4"> ఇటీవల మొత్తం నాలుగు కేసుల్లో మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఆ నాలుగు పిటిషన్లను కొట్టేసింది. కాగా పిన్నెల్లి ని అరెస్ట్ చేశారు. #pinnelli-ramakrishna-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి