Yashasvi Jaiswal: యశస్వి రికార్డుల మోత తో ధర్మశాల దద్దరిల్లింది.. 

ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాటర్ యశస్వి రికార్డుల మోత మోగింది. అతి తక్కువ మ్యాచుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా యశస్వి రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ పై 26 సిక్సర్లు బాదిన ఈ యువ బ్యాటర్ సచిన్ రికార్డ్ బద్దలు కొట్టాడు

New Update
Yashasvi Jaiswal: యశస్వి రికార్డుల మోత తో ధర్మశాల దద్దరిల్లింది.. 

Yashasvi Jaiswal: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఐదవ - చివరి మ్యాచ్‌ ధర్మశాలలో ఈరోజు ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో మొదటిరోజు టీం ఇండియా ఆటగాడు యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో అతి తక్కువ మ్యాచ్‌ల్లో 1000 పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అదే సమయంలో, అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా (Yashasvi Jaiswal)నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇలా ధర్మశాలలో యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగించాడు. 

అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. ధర్మశాల మైదానంలో జైస్వాల్ 57 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు, అందులో అతను 3 సిక్సర్లు కొట్టాడు. దీనితో పాటు జట్టుపై సిక్సర్లు కొట్టే విషయంలోనూ రికార్డు సృష్టించాడు. 

యశస్వి రికార్డులు ఇలా ఉన్నాయి.. 

  1. అత్యంత విజయవంతమైన రెండవ సగటు ఉన్న ఆటగాడు.. 

వెయ్యి పరుగులు పూర్తి చేసిన తర్వాత అత్యుత్తమ సగటును కలిగి ఉన్న రెండవ భారతీయుడుగా యశస్వి (Yashasvi Jaiswal)నిలిచాడు.  అతని ప్రస్తుత సగటు 71.43. ఛెతేశ్వర్ పుజారా వెయ్యి పరుగులు పూర్తి చేసినప్పుడు, అతని సగటు కూడా అదే. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ 83.33 సగటుతో మొదటి స్థానంలో ఉన్నాడు.

  1. వెయ్యి పరుగులు చేసిన నాల్గవ చిన్న వయస్కుడు జైస్వాల్.. 

టెస్ట్ క్రికెట్‌లో వెయ్యి పరుగులు చేసిన నాల్గవ పిన్న వయస్కుడైన భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)నిలిచాడు.  ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. సచిన్ కేవలం 19 ఏళ్ల 217 రోజుల వయసులో టెస్టు క్రికెట్‌లో వెయ్యి పరుగుల సంఖ్యను చేరుకున్నాడు.

  1. అతి తక్కువ మ్యాచ్‌లలో 1000 పరుగులు.. 

యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) 9 మ్యాచ్‌లలో 1000 పరుగులు పూర్తి చేశాడు. ప్రపంచంలో అతి తక్కువ మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మన్ ఈ జాబితాలో నంబర్-1 స్థానంలో ఉన్నాడు. అతను కేవలం 7 మ్యాచ్‌ల్లోనే 1000 పరుగులు చేశాడు. భారత్ తరఫున అతి తక్కువ మ్యాచ్‌లు ఆడి వెయ్యి పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా యశస్వి నిలిచాడు.

Also Read: రోహిత్‌ను ఊరిస్తోన్న 112ఏళ్ల రికార్డు.. అదే జరిగితే అద్భుతమే!

  1. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు..

తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన జైస్వాల్(Yashasvi Jaiswal) ఆరో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్,  వెస్టిండీస్‌కు చెందిన ఎవర్టన్ వీక్స్ 12 ఇన్నింగ్స్‌లలో వెయ్యి మార్క్‌ను చేరుకున్నారు. భారతీయులలో వినోద్ కాంబ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. అతని తర్వాత యశస్వి జైస్వాల్‌ నిలిచాడు. 

  1. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అత్యధిక పరుగులు.. 

ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్  గా  యశస్వి జైస్వాల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను 681 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లీ 655 పరుగులు చేశాడు.

  1. టెస్టుల్లో ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు.. 

ఒక జట్టుపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ తన కెరీర్‌లో ఆస్ట్రేలియాపై 25 సిక్సర్లు కొట్టాడు. జైస్వాల్ ఇంగ్లాండ్‌పై కేవలం 9 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్సర్లు కొట్టాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు