గరం గరంగా గన్నవరం రాజకీయం... యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా?

Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
గరం గరంగా గన్నవరం రాజకీయం...  యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా?

Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన యార్లగడ్డ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. యార్లగడ్డ ప్రకటన తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్టి స్పందిస్తూ పార్టీలో ఉండలేని వారు వెళ్లిపోవచ్చంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో యార్లగడ్డ తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

టీడీపీలో (TDP) చేరాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీకి చెక్‌ పెట్టాలంటే సైకిల్ ఎక్కడమే కరెక్ట్ అని సన్నిహితులు కూడా చెబుతున్నారని సమాచారం. యువనేత లోకేశ్ ( Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనుంది.  ఈనెల 22న గన్నవరం చేరుకుంటుంది. అనంతరం భారీ బహిరంగసభలో లోకేశ్ ప్రసంగించనున్నారు. దీంతో లోకేష్ సమక్షంలో యార్లగడ్డ పసుపు కండువా కప్పుకోనున్నారని అనుచరులు వెల్లడిస్తున్నారు. మరి ఈ సమావేశం తర్వాత యార్లగడ్డ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

కొన్నిరోజుల క్రితం గన్నవరంలో (Gannavaram) జరిగిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల నుంచి జగన్‌ (Jagan) అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని తెలిపారు.ఎలాంటి పరిణామాలు జరిగినా గన్నవరం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నానిని తేల్చేశారు. వైఎస్సార్‌సీపీ (YSRCP) అధికారంలో ఉన్నా కార్యకర్తలపై కేసులు తీయలేదని.. జగన్ తమ రాజకీయ భవిష్యత్ కు భరోసా ఇచ్చి గన్నవరం తీసుకువచ్చారన్నారు. తాను రాక ముందు ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటో ఇక్కడి వారికే బాగా తెలుసన్నారు. గత ఎన్నికల్లో దురదృష్టం, విధి వంచించటం వల్ల ఓడిపోయానని తెలిపారు.

మరోవైపు గన్నవరంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై స్ధానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇప్పటికే వంశీ తీరుకు వ్యతిరేకంగా నాలుగేళ్లుగా అసంతృప్తిగా ఉన్న యార్లగడ్డ ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగితే ఓటమి తప్పదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే టీడీపీకి కంచుకోటగా గన్నవరం ఉంది. గత రెండు పర్యాయాలుగా తెలుగుదేశం తరపున వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి బహిరంగంగానే మద్దతు ఇచ్చారు. దీంతో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వంశీతో ఇమడలేకపోయారు. మరోవైపు 2024లో వంశీని వైసీపీ నుంచి బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది. దీంతో గన్నవరం రాజకీయాలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి.

Also Read: హయత్ ప్లేస్ హోటల్‌ను ప్రారంభించిన సీఎం జగన్

Advertisment
Advertisment
తాజా కథనాలు