రాజకీయాలు Yarlagadda Venkata Rao Sensational Comments: పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా: యార్లగడ్డ తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఇరువురూ కొద్దిసేపు చర్చలు జరిపారు. ఈ నెల 22న గన్నవరం సభలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం యార్లగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డబ్బు సంపాదించాలని తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ఆరేళ్లుగా వైసీపీకి సేవ చేశానని, మూడున్నర ఏళ్లుగా వైసీపీలో ఎన్నో చూశానన్నారు యార్లగడ్డ. By E. Chinni 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు YCP Senior Leader Sajjala Ramakrishna Reddy: యార్లగడ్డ నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. ముందే నిర్ణయం తీసుకున్నారనుకుంట: సజ్జల గన్నవరం వైసీపీ సీనియర్ నేత యార్లగడ్డ వెంకట్రావు.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యార్లగడ్డ కౌంటర్ ఇచ్చారు. యార్లగడ్డ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. పార్టీ కోసం పని చేయాలన్నారు. తమకు అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలన్నారు. ఒక పదవి కోసం 50, 100 పోటీ చేసే పరిస్థితి ఉందన్నారు సజ్జల. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. ఇటువంటి అంశాలపై పార్టీలో అంతర్గతంగా చర్చించాలి.. కానీ ఇలా బహిరంగంగా ప్రకటనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఒక నిర్ణయం తీసుకునే ఇప్పుడు ఈ ప్రకటనలు చేశారు అనిపిస్తోందని అన్నారు సజ్జల. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao : యార్లగడ్డను వైసీపీ అవమానించిందా? పొమ్మనలేక పొగపెట్టిందా? వైసీపీకి గుడ్ బై చెప్పారు గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా యార్లగడ్డ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని యార్లగడ్డ తేల్చి చెప్పారు. By E. Chinni 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ గరం గరంగా గన్నవరం రాజకీయం... యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా? Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By BalaMurali Krishna 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Yarlagadda Venkata Rao : ఏది ఏమైనా గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ! ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn