Jr NTR : ఆయన ఆకాశం.. ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది.. బాలయ్యకు యార్లగడ్డ చురకలు! జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగించమని బాలకృష్ణ అనడం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి మాజీ ఎంపీ యార్లగడ్డ ప్రస్తావించారు. తారక్ ఆకాశం లాంటి వారు ..దాని మీద ఉమ్మేయాలని చూస్తే మీ మీదే పడుతుందని అన్నారు. By Bhavana 19 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి Jr NTR : గురువారం ఎన్టీఆర్(NTR) వర్థంతి సందర్భంగా హైదరాబాద్(Hyderabad) లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించమని టీడీపీ(TDP) ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అన్న మాటలు ఇప్పుడు పెద్ద వివాదానికి తెర లేపింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య ప్రవర్తించిన తీరు పై గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా బాలయ్య బాబు పై ఫైర్ అయ్యారు. తాజాగా ఈ విషయం గురించి మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్(Yarlagadda Lakshmi Prasad) జూనియర్ ఎన్టీర్ ప్లెక్సీల తొలగింపు పై బాలయ్యకి చురకలు అంటించారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. తారక్ ఆకాశంలో ఉన్నారు. ఆయన్ను తగ్గించాలని చూస్తే ఆకాశం పై ఉమ్మేసినట్లే అవుతుంది.. అది బాలయ్య అయినా సరే.. ఇంక వేరేవరైనా సరే అంటూ పేర్కొన్నారు. తారక్ దిన దినాభివృద్ధికి కారణం ఆయన తల్లి. అంతేకానీ ఆయన ఎదుగుదలలో బాలయ్య ప్రమేయం కానీ.. ఇంకెవ్వరి ప్రమేయం కానీ లేదు అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యార్లగడ్డ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉన్నట్లు తెలిపారు. నా విజయాలకు, అపజయాలకు జగన్ దే బాధ్యత అన్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఏమి జరగనుందో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. ఎన్టీఆర్ 28 వ వర్థంతి, ఏ ఎన్ ఆర్ శత జయంతి కార్యక్రమాన్ని లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ రాజకీయ ప్రముఖులు చాలా మంది పాల్గొననున్నట్లు తెలిపారు. Also read: కేంద్రం కొత్త నిర్ణయం..ఇక పై వారికి కోచింగ్ సెంటర్ లలో అనుమతి లేదు! #chandrababu #balakrishna #ntr #yarlagadda-lakshmi-prasad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి