AP Politics: చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత.. యనమల సంచలన ప్రెస్ మీట్

రాజమహేంద్రవరం కేంద్ర కాగారారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లు కాకుండా డిప్యూటీ సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు.

New Update
AP Politics: చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత.. యనమల సంచలన ప్రెస్ మీట్

రాజమహేంద్రవరంలో విద్యానగర్‌లోని నారా లోకేష్ క్యాంప్ సైట్‌లో యనమల రామకృష్ణుడు శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆరోగ్యం గురించి జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్ అధికారి ఇచ్చిన నివేదికలో ఏముంది.? ఏ రిపోర్టులు చూసి ఆరోగ్యం బాగుందని బులిటెన్ బయటకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. కనీస పరీక్షలు చేయలేదు..రక్త పరీక్ష కూడా చేయలేదని ఆరోపించారు. ఆరోగ్యం బాగోలేకనే చర్మంపై దద్దుర్లు, అలర్జీ వచ్చిందన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై మొదటి నుంచి ప్రభుత్వం, అధికారులు తప్పుడు సమాచారం బయటకు ఇస్తున్నారని ఆరోపించారు. హెల్త్ బులిటెన్ ఇచ్చినప్పుడు సంబంధిత అధికారులు విడుదల చేయాలన్నారు. కానీ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ విడుదల చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు పరిశీలించినట్లుగా ఆరోగ్య బులిటెన్‌లో లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముద్దాయి అన్న పదం వాడారు తప్పా.. డాక్టర్లు పరీక్షలు చేసినట్లు బులిటెన్‌లో లేదన్నారు.

రిపోర్టులు ఎక్కుడున్నాయి
డిప్యూటీ సూపరింటెండెంట్ తాను సొంతంగా లేఖ రాసి బయటకు వదిలారన్నారు. డాక్టర్లు పరీక్షలు చేసిన రిపోర్టులు ఎక్కుడున్నాయని ప్రశ్నించారు. డాక్టర్ రిలీజ్ చేసిన మెడికల్ రిపోర్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జైలులో చంద్రబాబు ఉండే రూము, అక్కడి పరిసర ప్రాంతం సరిగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్య వచ్చిందన్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్‌కు బోరు నీళ్లు వెళ్తాయన్నారు. అయితే.. ఆ ట్యాంకు శుభ్రం చేస్తున్నారో లేదో తెలియదన్నారు. అలాంటి నీళ్లతో చంద్రబాబు స్నానం చేయాల్సి వస్తోందని ఆరోపించారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత.. ఆయన గురించి ప్రభుత్వం తప్పకుండా ఆలోచించాలని యనమల అన్నారు. తప్పుడు కేసులు.. తప్పుడు సాక్ష్యాలతో అకారణంగా చంద్రబాబును ఇరికించారు. ఈ వయసులో చంద్రబాబును ఇలాంటి కష్టాలు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి అనారోగ్య సమస్యలతో బాధ పడితే తక్షణమే ఆస్పత్రిలో చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

పోలీసుల సమక్షంలోనే ఉంచుకోవచ్చు

చంద్రబాబుకు పూర్తి స్థాయిలో పరీక్షలు చేయాల్సి ఉందని యనమలు అన్నారు. చంద్రబాబు అనారోగ్యంపై లీగల్‌గా కూడా వ్యవహరిస్తామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై డాక్టర్లు కాకుండా సూపరింటెండెంట్ ఎలా రిపోర్టు ఇస్తారని ప్రశ్నించారు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ఎందుకివ్వడం లేదు.? టెస్టు చేసినప్పుడు డాక్టర్లు సంతకాలు చేయాల్సి ఉంటుందన్నారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌తో తప్పుడు రిపోర్టు విడుదల చేయించారని యనమల ఆరోపించారు. చంద్రబాబును సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి..కోలుకునేదాకా డాక్టర్ల సమక్షంలో ఉంచాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: తెలంగాణను ఏపీలో కలిపేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర.. మంత్రి గంగుల సంచలన ఆరోపణలు

Advertisment
Advertisment
తాజా కథనాలు