సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్లనున్న షావోమీ ఎలక్ట్రిక్ కార్!

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి SUV ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత్ కు తీసుకురానుంది.ఇప్పటికే చైనాలో ఈ ఎలక్ట్రికల్ కారును లాంచ్ చేశారు. భారత మార్కెట్‌లో షావోమి అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి అయిన తరుణంలో బెంగళూరులో ఈ SUV7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనలో ఉంచారు.

New Update
సింగిల్ ఛార్జ్‌‌తో 800 కి.మీ దూసుకెళ్లనున్న షావోమీ ఎలక్ట్రిక్ కార్!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి SUV7ఎలక్ట్రిక్ కారును భారత్ కు తీసుకురానుంది. షావోమీ కూడా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.షావోమీ SUV7 ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే ఇదే పేరుతో చైనాలో లాంచ్ చేయగా.. ఇతర కార్ల కంపెనీలకు పోటీగా నిలిచింది. చైనా మార్కెట్లో ఈ SUV7 ఎలక్ట్రిక్ కారు మోడల్ ధర 2,15,900 యువాన్‌లు. మన భారత కరెన్సీలో రూ.25 లక్షలు అనమాట. భారత మార్కెట్‌లో షావోమి అడుగుపెట్టి 10ఏళ్లు పూర్తి అయిన తరుణంలో బెంగళూరులో ఈ SUV7 ఎలక్ట్రిక్ కారును ప్రదర్శనలో ఉంచారు. దేశీయ మార్కెట్లో షావోమీ ఈవీ కారుపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి.

ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. 5 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రీమియం సెడాన్‌ లో-డ్యూయల్ మోటర్స్ కలిగి ఉంది. 101KWH బ్యాటరీతో తయారైన ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 800 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. లగ్జరీ ఎక్స్‌టీరియర్‌ కలిగిన ఈవీ కారుకు భారతీయ వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేలా ఉంది. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు