మహిళా రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌కు బిగ్‌ షాక్‌.. మూడేళ్ల పాటు నిషేధం !

మహిళా రెజ్లర్ అంతిమ్‌ ఫంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించనున్నారు. అంతిమ్‌ అక్రిడేషన్ కార్డుతో.. తన సోదరి అథ్లెట్లు ఉండే చోటుకు (ఒలింపిక్ విలేజ్‌)కు వెళ్లడంతో రూల్స్ బ్రేక్ చేసిందనే కారణంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ నిర్ణయం తీసుకుంది. 

New Update
మహిళా రెజ్లర్‌ అంతిమ్‌ పంగల్‌కు బిగ్‌ షాక్‌.. మూడేళ్ల పాటు నిషేధం !

మహిళా రెజ్లర్ అంతిమ్‌ ఫంగల్‌పై మూడేళ్ల నిషేధం విధించనున్నారు. ఒలింపిక్స్‌ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంధించినందుకు ఐవోఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్) ఈ నిర్ణయం తీసుకుంది. అంతిమ్‌ అక్రిడేషన్ కార్డుతో.. తన సోదరిని అథ్లెట్లు ఉండే చోటుకు (ఒలింపిక్ విలేజ్‌)కు వెళ్లింది. ఇలా రూల్స్‌ బ్రేక్ చేసినందుకు ఐవోఏ అంతిమ్‌పై నిషేధం విధించనుంది. ఆమె భారత్‌కు చేరుకున్న తర్వాత ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఐవోఏ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ అంతిమ్‌, తన సపోర్ట్‌ స్టాఫ్‌ను భారత్‌కు పంపించాలని నిర్ణయించింది. అలాగే అంతిమ్‌ సోదరిని అధికారులు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు పలు వర్గాలు రాత్రి వెల్లడించాయి. బుధవారం 53 కేజీల రెజ్లింగ్ విభాగంలో జరిగిన పోటీలో అంతిమ్ ఓడిపోయింది. ఆ తర్వాత ఈ వ్యవహారం జరిగింది.

Also Read: ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు బంగ్లాదేశ్‌ హిందువులు ప్రయత్నం..!

అయితే ఈ వివాదంపై అంతిమ్‌ పంగల్‌ ఓ వీడియో సందేశంలో క్లారిటీ ఇచ్చింది. ' పారిస్‌లో నన్ను, నా సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వస్తున్న రూమర్స్ అసత్యాలు. అలాంటిది ఏం జరగలేదు. నిన్న మ్యాచ్‌ ఓడిపోయిన తర్వాత నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. దీంతో ఓ హోటల్లో ఉంటున్న నా సోదరి అక్కడికి రమ్మని చెప్పింది. నేను నా కోచ్‌ నుంచి అనుమతి తీసుకున్నాను. వారు పర్మిషన్ ఇచ్చారు. హోటల్‌కి వచ్చాక.. నా వస్తువులు నాకు అవసరమయ్యాయి. కానీ అవి ఒలింపిక్ విలేజ్‌లోనే ఉండిపోయాయి.

నా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నేను నిద్రపోయాను. నా సోదరి నా అక్రిడేషన్ కార్డు తీసుకొని ఒలింపిక్ విలేజ్‌కు వెళ్లింది. అక్కడికి వెళ్లాక.. ఇది అంతిమ్‌ అక్రిడేషన్‌ కార్డ్‌ అని, ఆమె ఆరోగ్యం సరిగా లేదని, నేను ఆమె వస్తువులు తీసుకెళ్లడానికి వచ్చానని చెప్పింది. దీంతో అధికారులు అక్రిడేషన్‌ కార్డును తీసుకొని, వెరిఫికేషన్ కోసం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లలేదు. కేవలం మా చెల్లెలు మాత్రమే వెళ్లింది. అది కూడా అక్రిడేషన్ కార్డు వెరిఫై చేయడం కోసమే. ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించారు, అక్రిడేషన్ కార్డును అందజేశారని' అంతిమ్‌ తెలిపింది.

Also Read: ఎవరీ మొహమ్మద్ యూనస్? ఆయనకూ.. హసీనాకు మధ్య ఏమిటి గొడవ ?

Advertisment
Advertisment
తాజా కథనాలు