DairyMilk: మరోసారి డైరీ మిల్క్ లో పురుగులు.. తింటే స్మశానానికే! మరోసారి క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ లో పురుగులు దర్శనమిచ్చాయి. ఎక్స్‌పైరీ డేట్ ముగియకముందే అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కొన్న చాక్లెట్ కుళ్లిపోయిందంటూ ఓ నెటిజన్ ఫొటోలు పోస్ట్ చేశారు. దీనిపై ఫుడ్ సెఫ్టీ అధికారులనుంచి ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడం విశేషం. పోస్ట్ వైరల్ అవుతుంది. By srinivas 28 Apr 2024 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి Cadbury Dairy Milk: పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలే హైదరాబాద్ అమీర్ మెట్రో స్టేషన్ లో ఓ వ్యక్తి ఈ చాక్లెట్ కొని కవర్ తెరవగానే పురుగులు కనిపించాయి. దీంతో వెంటనే జీహెచ్ఎంసీకి అధికారులకు ఫిర్యాదు చేయగా.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. చాక్లెట్ల నమూనాలను ల్యాబ్‌కు పంపించి పరీక్షించగా ఇవి తింటే ఆరోగ్యానికి హానీకరమని హెచ్చరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా మరోసారి ఇదే చాక్లెట్ లో పురుగులు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. The manufacturing of these dairy milk is January 2024, expiry is best before 12 months from manufacture. Found them like this when I opened it. Look into this @DairyMilkIn pic.twitter.com/ZcAXF2Db6x — That Hyderabadi pilla (@goooofboll) April 27, 2024 ఇది కూడా చదవండి: Iran- Israel War : ఇరాన్ రక్షణ వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడులు.. ఉద్రిక్త పరిస్థితులు! చాక్లెట్ లో ఫంగస్.. ఈ మేరకు శుక్రవారం 'హైదరాబాదీ పిల్లా' అనే పేరుతో ఎక్స్ ఖాతా కలిగివున్న ఓ నెటిజన్ అమీర్ పేట మెట్రో స్టేషన్ లో డైరీ మిల్క్ చాక్లెట్‌ను కోనుగోలు చేశారు. తీరా తిందామని కవర్ తెరిచి చూస్తే అందులో ఫంగస్ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన యువతి.. వెంటనే దానిని నెట్టింట పోస్ట్ చేసింది. 'డైరీ మిల్క్ చాక్లెట్ తయారీ తేదీ జనవరి 2024 ఉంది. 12 నెలల వరకు దాని ఎక్స్‌పైరీ డేట్ ఉంది. కానీ చాక్లెట్ తెరిచి చూస్తే ఇలా ఉంది. దీనిని చూడండి' అంటూ చాక్లెట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ట్వీట్ వైరల్ కాగా.. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇంత దారుణం జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని, దీనిపై కఠినమైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేని పశ్నిస్తున్నారు. ఫొటోలు వైరల్ అవుతున్నాయి. #worms #cadbury-dairy-milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి